The Telugus

ఇవాళ ఇక్కడ‌, రేపు ఎక్కడో? -2

www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -22

 By Someswar Bhagwat

ఇవాళ ఇక్కడ‌, రేపు ఎక్కడో? -2

ఈ కొత్త సంస్కృతి ఒక్క పత్రికలతో డబ్బు చేసుకునేందుకు అసత్యవార్తలు డబ్బుతీసుకు రాయడం లాటి చెడు దార్లకి పరిమితము కాదు. మంచి   జర్నలిస్ట్ లకి పూర్వం ఎప్పుడూ లేని కొత్త ఆవకాశాలు దొరుకుతున్నాయి. వారు ఒకప్పుడు మార్పుకీ ప్రజా సంబంధ అధికారి (public relations officer)గా వెళ్లే వారు. ఈ ఉద్యోగానికి ముఖ్య అర్హతలలో మొదటిది పత్రికలో పనిచెయ్యడం. కొందరు ప్రకటన సంస్థల (Ad Agencies) లో కూడా చేరేవారు.


ఇప్పుడు వారికి చాల కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. పత్రికలనుంచి వారు ఇప్పుడు రేడియో‌,  టెలివిజన్ న్యూస్ చేనల్సు చేరవచ్చు.  ప్రముబ వార్తలపై   విడియోలు.చయ్యొచ్చు. పత్రకారులు  మినిస్టర్లకీ  ముఖ్య మంత్రులకీ ప్రధానమంత్రికీ  ప్రెస్ ఎడ్వైసర్ గా పని చెయ్యవచ్చు (కానీ వారు దిగిపోతే వీరి ఉద్యోగం  పోతుంది.)


కొత్తగా సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత  ఎక్కువై పెద్ద హూదాలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇప్పుడు వీటిసంగతి చూబడానికి ఒక మనిషిని పెట్టుకో వలసి  వస్తున్నది. దీనికి పత్రకారులుబాగా పనికి వస్తారు. ప్రజాజీవితంలో ఉన్న చాలా మంది ఈరోజు  వీరిని నియమిస్తున్నారు.  


దశాబ్దాల క్రితం మిత్రండు K.A. Abbas ఒక పత్రకారుడిగా Blitz వార పత్రికలో Last  Page column కాక Bombay  Chronicle లో సినిమా  సమీక్షలు రాసేవారు. ఓ రోజు ఎవరో  “అందరిని  criticise చేయడం చాలా సులభం. ఒక స్క్రిప్ట్ రాస్తే తెలుస్తుంది ఎంత కష్టమో‌” అంటేపంతం మీద ఒక  స్క్రిప్ట్ రాసేరుట. మరెవరో “దాంట్లో ఏముంది అసలుపని దానికి రూపం ఇవ్పడం,” అంటే ఒక సినిమా డైరెక్టర్  అయి, దేశానికి అమితాభ్  బచ్చన్  వంటి గొప్ప  నటుడినే  పరిచయం చేసేరు


తన కోలంలో నన్ను పేరుతోకాక “నాకు నేను జర్నలిస్ట్ నని జ్ఞాపకంచేసే నా నాగపూర్ మిత్రుడు” అని రెండు సార్లు సంభోదించారు (పేరు మరిచేమో). పేరు కన్నా ముఖ్యం తను పత్ర రచయిత  అని గుర్తుచేయడం. 


ఏ కొత్త పనిలో చేరినా‌, పనికి ఎన్ని రంగులు పూసినా,   తను.మొదట జర్నలిస్ట్ అని మరవ కూడదు . మీఅసలుపని   బోధపడేలా చెప్శడం (convey or communicate).

Exit mobile version