‘పెన్యురీ’ అనే పట్నం -23
By Someswar Bhagwat
చెప్పేదెవరు, చెప్పించేదెవరు?
పాత (ఇంగ్లీషు మీడియం అనివార్యం కాక ముందు) తెలుగు వారికి ఎవరికీ పోతన మహా భారతం మొదటిలోనే చెప్పిన విషయం జ్ఞాపకం చెయ్యడం అనవసరం ఏమో – అంతగొప్ఫ మహా కావ్యానికి తనే రచయితనని గర్వ పడకుండా తను కేవలం నిమిత్త మాత్రుడిని అనీ, చెప్తున్నది తనైనా ‘చెప్పించిన వాడు రామభద్రుండట’ అని చెప్పే అణుకువతనం (humility) చూపించడం అతని మహనీయతనే చాటుతుంది. ఆ అణకువే ఈనాటి పత్ర రచయిత లందరికీ ఒక ఆదర్శం. ఏరంగంలో కన్నా.ఎక్కువ ఈవ్రుత్తిలో ఆ humility కోల్పోయిన వారు ఎక్కువ. అదివారి ఒకరి తప్పేకాదు.’
మారుతున్న పత్రికా సంస్క్రతిలో ఒక పెద్ద మార్పు వచ్చినది రచయిత పేరు ప్రకటించడంలో. దాన్ని మాకాలంలో చాలా అరుదుగా వాడేవారు. దానిని అప్పుడు byline అనేవారు. ఇందర్ మల్హోత్రా (The Times of India) లెక జి.కె.రెడ్డి (The Hindu)లాటి పెద్ధ పత్ర కర్తలకే ఆ గౌరవం దక్కేది. కొన్ని చాలా పరిశోధించి రాసిన investigative reports కాని, పెద్ధ రహస్యం బేధించి అతికష్టం మీద మరే పత్రికకీ దొరక కుండా తీసుకొచ్చిన exclusive వార్త ఐనప్పుడో, రచనా విధానం చాలా వేరైనప్పుడో, చాలా ముఖ్యమైన వార్తలకో, “దీని బాధ్యత మాదికాదు, ఈ సంవాదదాతది” (అంటే కొట్టినా రాళ్ళు విసిరినా ఆవ్యక్తి మీదే) అని తెలపడానికి మాత్రం రచయిత పేరు byline గా ప్రకటించడం జరిగేది. ఆ రోజుల్లో పత్రిక లో రాసేవారు చాలా తక్కువ మందే ప్రజలకి తెలిసిన ప్రఖ్యాత వ్యక్తులు (public heroes or celebrities) అయేవారు.
కొన్నిసార్లు తమ క్షేమంకోసం రిపోర్టర్లే మాకు byline ఇవ్వొద్దనేవారు. నేనొక దినత్రిక news editor గా ఉన్నప్పుడు ఒక.ప్రభుత్వ ఆస్పత్రిలో ‘జైలు వార్డ్’ లో జరిగే అవకతవకల గురించి తెలిసింది. కాని దాని లోగుట్టు (inside story) తెలియడానికి ఒకటే మార్గం. అందరితో మాట్లాడి ఒక కొత్త రిపో ర్టర్ ఎంపిక చేసీ అతను ఏదో చిన్నతప్పుకి ఎరెస్ట్ ఐ, వెంటనే జబ్బు పడ్డట్టు పత్రం స్రుష్టించి అతను అదే వార్డ్ లో admit అయేట్లా చూసిన రెండు వారాల తరవాత అతను దొంగలు, హంతకులమధ్థ్య, పోలీసుల ‘రక్షణ’తో ఎలా గడిపాడో, ఎవరికో లంచాలిచ్చి లేని ఉత్తుత్తి జబ్బులతో ఆవార్డ్ లోచేరి పోలీసులకు తెలిసినా కళ్ళుమూసుకుని ఉంటే బైటకీ వెళ్ళివాళ్ళ ‘పనులు’ చేసుకుని ఎందరో నేరస్తులు ఎలా న్యాయాన్ని మోసం చేసేవారో కొన్ని రోజులు ప్రచురించడమే కాక అతని పేరుకూడా బైటపడకుండా జాగ్రత్తగా ఉంచేం.
అంత కొత్త రిపోర్టర్ కి వార్డులో ఉండటానికీ తన identity దాచడానికీ కలిపి నెల ‘సెలవు’ ఎలా మంజూరు చేసానని ప్రశ్నించిన యజమాన్యం, తక్కిన రిపోర్టర్లు, అన్నీ తెలిసిన నేను కూడా నెల తరవాత గడ్డం పెంచి, వేషం మార్ఛిన అతన్ని పోల్చుకోలేకపోయాం. దీనికి కొందరు పోలీసు అధికారులు. డాక్టర్లు కూడా సాయం చేసారు. అతను నేరస్తుల నుంచి తనను కాపాడుకోవాలికదా. గుట్టు బైటపడితే వాళ్ళు ఊరుకోరుగా.
ఇంత పెద్ద వార్తకి.అతనికి బైలైను దొరక లేదు కాని ఈరోజు ‘రెండు కార్లు డీ ‘ , ‘జేబుదొంగ ఎరెస్ట్’ లాటి చిన్న వార్తలకి కూడా బైలైన్ ఇస్తాం. ఎందరో.దీనివల్ల సెలిబ్రిటీలైపోతున్నారు. ప్డకొందరైతే రచయిత బొమ్మలుకూడా వెయ్యడం మొదలెట్టారు. పెద్దవ్యాసాలతో ఎడిట్ పేజీ మీద ఇది ముందునుంచీ మామూలే. ఇలాటి వారు న్యూస్ చేనల్ కి మారడంకూడా జరుగుతున్నది
బైలైన్ పత్రికారంగం సంస్కృతినే మార్చి వేస్తున్నది.