www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -24

 By Someswar Bhagwat

పేరు ప్రింటులో చూసిన నషా 

పత్రికా ప్రపంచంలోకి అడుగు పెట్పడానికి పూర్వకాలంలో రెండు కారణాలు మాత్రం ఉండేవి — తక్కిన వారు చదివి మెచ్చుకోవాలని ఉన్న తపన అందులో మొదటిది — the urge to express. రెండోది తనపేరు ముద్రిత రూపంలో చూస్తే.వచ్చిన నషా.  ఈ రెండవ కోరిక byline తీరుస్తుంది. అలా  కొన్నిసార్లు చూసేక ఎలాటి thrill ఉండక అది మామూలైపోతుంది. అలాగే  మొదటి rejectiin slip  (తిరస్కరిస్తూ వచ్చినఉత్తరం) కూడా. కొన్ని   ఇలాటివి చూసేక కొందరు నిరాశతో రాయడమే మానివేస్తారు, మరికొందరు ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. నాకు తెలిసిన ఒక.రచయిత తనపేరే మార్చి‌ అలాటి ఉత్తరాలం జమచెయ్యడమే hobby అయి,  వాటి ప్రదర్శనలు పెట్టి, ‘Regret Iyer’ గా ప్రసిద్ది చెందాడు (ఆ ఉత్తరాలలో రచన reject అయిందని అనకుండా “తిప్పి పంపిస్తున్నందుకు చింతిస్తున్నాము” అని రాస్తారు. తెలుగు వాడైతే   ఇంటి పేరే ‘చింతా’వారు అయేది.  ఆ  ఇంటిపేరున్న ఒక.డాక్టరు ఓఏజన్సీకి  పార్ట్ టైంవార్తాహరుడిగా ఉండేవారు. అంటే మరో  వ్రుత్తిలో  ఉండి కూడా.పత్రికలలో పని చెయ్యవచ్చు అనమాట.


ఏ పత్రికలో పని చెయ్యకుండా అనేక పత్రికలలో రాసేవారిని freelance journalist అంటారు …. ఎటు కావలిస్తే అటు బల్లెం  (lance) విసిరే వ్యక్తి ఆనమాట.
ఈరంగంలోకి మామూలుగా ఎలా ప్రవేశిస్తారు?   ముందు ఎన్పిసార్లు reject ఔతారు? చాలా మందికీ  ఈ సందేహాలు  వస్తాయి.


నాకు 15-16 సంవత్సరాల వయసులో పిచ్చిగా  పుస్తకాలు చదవడం ఒక అలవాటు (వ్యసవం) అయి. పత్రికలలో రాయడానికి ప్రయత్నం చేస్తున్న ఒక పెద్దైన బంధువు ఆదర్శం అయారు. అతను ఒక వ్యాసం తీసుకుని ఆఊర్లో ఉన్న ఒక పత్రిక ఆఫీస్ కి వెళ్లారు. ఆక్కడ  నలిగిపోయిన షరాయి‌, జుబ్బా వేసుకుని, బీడీ కాలుస్తూ వరండాలో పచార్లు చేస్తూ ఒక ముసలివాడు కనిపీస్తే చప్రాసీ అనుకుని ‘నేను ఎడిటర్ గారని కలియాలి’ అని చెప్తే ఆగమని తను లోపలికి వెళ్ళాడు. ఒక నిమిషం తరవాత మరొక చప్రాసీ వచ్చి లోపలికిపిలుస్తున్నట్లు చెప్పాడు.  ఇతను లోవలికి  వెళ్తే ముందటీ ముసలి మనిషి ఎడిటర్ కుర్చీలో కనిపించి ఏమిటి కావాలి అనిప్రశ్న్నించాడు.  ఇతను తను తీసుకు వెళ్లిన కాగితాలు అతని ముందు ఉంచితే ఒక నిమిషం చదివి “ఏమిటిది?” అని అడిగాడు.

 
జవాబు “ఒక హాస్యరచన. నాదే,” అని.అతను వెంటనే రచయిత పేరు చూసి, ఆపేరుతో పిలిచి అన్ళాడుట, “Mr…… వస్తున్న పదేళ్లు P.G. Wodehose, Mark Twain రాసిన పుస్తకాలు చదివి హాస్యరచన  తేకుండా రండి.  హాస్యం ఏమిటో  అప్పుడు చర్చిద్దాం.”  అని. పాపం అతనికి అహంకారం ఏమాత్రం లేదు. ఎడిటర్ చెప్పిన ఇద్దరూ నా ప్రియ రచయితలని తెలిసిన ఆయనే నాకు జరిగింది అంతా చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, నేనే ఒక హాస్య రచన ఎందుకు రాయకూడదు? ఆని.అదిరాసి స్వయంగా తీసుకెళ్ళడానికి ధైర్యం చాలక పోస్ట్ లో పంపించాను – తీసుకెళ్తే నాదేనంటే నమ్ముతారనే నమ్మకం లేక. కొన్ని రోజుల తరువాత ఆ పెద్దాయనే వచ్చి చెప్పారు, ఆది ప్రచురించబడిందని. ఆతరువాత మరో రెండు అలాగే ప్రింట్ ఐతే ఆతనే వచ్చి చెప్పారు (అప్పటి వరకు పత్రిక కొనే అలవాటు లేక).   నేను ఈ వ్రుత్తిలో ప్రవేశం చెయ్యడం అతని వల్లనే. అతనికి వచ్చిన ఎన్నో తిరస్కృతులే నాకు ఆహ్వానాలయేయి. అతనికున్న  ప్రభుత్వ ఉద్యోగం రక్షించేయి.


మూడు ప్రచురించబడిన  తరవాత ఒకటి రాసి అదే పత్రికకి ఒక.ఉత్తరంతో పంపేను. సంపాదకుడిని సంబోధించి, “ఈ రచన దీపావళి ప్రత్యేక సంచికలో లేకపోతే తిరస్కరించారని తెలిసి పోతుంది. దయచేసి తిరస్కరించినట్టు రాయవద్దు. కారణం,  నేను ఇప్ఫటి వరకూ rejection slip చూడలేదు” అని ఆ ఉత్తరం.  ఆంటే అప్పటీ వరకూ తిరస్కరించబడలేదు అని బడాయి అనమాట  —   మూడు   ప్రచురణలేమీ  గొప్ప కాదని తెలియని చిన్న తనంలో.  ఎన్నో ప్రచురింపబడినా కొందరు వ్రుత్తి నుంచే నిష్క్రమించవచ్చు.

కొన్నేళ్లుగా పత్రికలలో పనిచేసీ  PROగా  కాని వ్యాపార సంపర్కాధికారి (business liaison officer) కానీ అవొచ్చు.  ఈ రెండింటకీ బాగా వ్యక్త పరచడం (communication skills) అవసరం. నా విద్యార్థి ఒకరు 24ఏళ్ళకన్నఎక్కువ  దిన పత్రికలో పని చేసిన తరువాత ఒక అంతర్జాతీయ కంపెనీలో చేరి ఈమధ్యే రిటైర్ అయాడు. అంటే రిజెక్ట్ అవడం మమూలే. అప్పుడు నాకది తెలియదు. దీపావళి సంచిక  తెరిచి  చూస్తే  షాక్  తగిలింది. ఆ ఉత్తరాన్నే  ప్రచురించి దానికీంద  “ఇలా రాసేడు…….”   అని నా  byline  ఇచ్చి  “కాని ఇది మాకు ఎంతో నచ్చి  దీన్ని లేటుగా వచ్చినా ప్రచురిస్తున్నాం” అని ముద్రించేరు. Byline ఇవ్వడానికీ ఈ వింత పధ్ధతి అవలంబించినది  ఆ సంచిక తయారు చేసిన ఒక బెంగాలీ పత్రకారుడు తరుణ్ కుమార్ భదూరీ — ప్రఖ్యాత నటి జయా భదూరీ తండ్రి,  అమితాభ్ బచ్ఛన్ మామగారు.  అతను జీవితమంతా దినపత్రికలలో పనిచేసి TheStatesman (కలకత్తా, ఢిల్లీ) భోపాల్ విషేష సంవాదదాతగా పదవీ విరామం చేసేరని అందరికీ తెలుసు. కాని అతను Taroon Coomar ఆని రాసేవారని చాలామందికి తెలియదు (ఇంతకుముందు చెప్పేనుగా షరైన పేర్లు వాడడం ఎంత ముఖ్యమో, ఎలా తెలుగు, తమిళ, పత్రికలలో దేశప్రధాని  ‘మోడీ’ కాదని మోదీఅని  తెలియని  ‘డింకర్-డినేష్’ లు పనిచేస్తున్నారో.)


ఈ కథలు  చెప్పడం స్వంత డబ్బాకీ కాదు. byline, rejection slip గురించీ, పత్రికలలో ప్రవేశించడం బోధ పరిచి  చెప్పడానికి. 

 
ఇంకొన్ని రచనలు ప్రచురింప బడిన తరవాత ఓరోజు నేను పని నేర్చుకోడం కోసం జీతం లేకుండా పనిచేస్తున్న ఏజన్సీకి .నాకోసం. భదూరీ. ఫోన్ వచ్చింది తనని కలియాలీ అని.  ఏదో పెద్దతప్పుకి బాగా చీవాట్లు పడతాయని  భయపడుతూ  వెళ్తే భదూరీ నాచెయ్యపట్టుకుని  ఎడిటర్ గదికి తీసుకునివెళ్లి “నేను మీతో చెప్పింది ఇతనిగురించే,” అన్నారు. ఎడిటర్ అడిగారు, “నీకు జర్నలిస్ట్ అవాలని ఉందా?” అని. ఆ ముందు రోజే   Dale Carnegie  పుస్తకంలో చదివినది గుర్తువచ్చింది. నసగకుండా వెంటనే అవునని జవాబిచ్చాను. నన్ను మర్నాడే ఆరునెలల probationమీద తీసుకున్నారు. ఇలాకొత్తవారికి సాయం  చెయ్యడం  కొందరు మెన్టరింగ్ అంటే మరికొందరు అతను నా godfather  అనొచ్చు. పేరుఏదైనా ఇలాగే పత్రికల్లో పూర్వం ప్రవేశందొరికేది.


ఇప్పుడు సంస్కృతి మారి ఎంట్రెన్సు పరీక్షలూ, ఇంటర్వ్యూలు వచ్చేయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here