‘పెన్యురీ’ అనే పట్నం -25
By Someswar Bhagwat
బద్ధకం పత్రకర్తకి పెద్ద శత్రువు
ఈ పత్రికా ప్రపంచంలో bylineలో మీ పేరు చూసుకునే సంతోషాలూ, రచనలు తిరస్కరించ బడితే వచ్చే విచారాలూ రెండూ ఉన్నాయి. It takes all sorts to make the world అంటారు కదా. ఈ తీపి-చేదు కలయికల ఉగాది పచ్చడిలో బద్ధకం అన్న పులుపు చేరడం సహజమే.
ఎప్పుడూ నిర్ధారిత సమయం (deadlines) మరియు శీర్షికల పరుగు ఉండనే ఉంటుంది కాబట్టి అలసటతో వచ్చే బద్ధకం మామూలే. కాని అది ఎక్కువ ఐతే కష్టమే. ఇది దిద్దే సబ్ ఎడిటర్లుకి పరిమితం కాదు. రాసే రిపోర్టర్, వ్యాసాలు, సంపాదకీయాలు రాసే వారు అందరూ దాని నుంచి తప్పించుకోవడానికి కష్టపడాలి.
అన్ని రంగాల్లో ఈ జాగ్రత అవసరం, కాని పత్రికలలో ఇది చెరపబడని సిరాతో ముద్రింబడుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ తప్పూ లేని పత్రిక ఈ ప్రపంచంలో ఉండదు – ప్రశ్న ఎక్కువ తక్కువలది మాత్రమే. అవి పెద్ద అక్షరాలతో శీర్షికలలో ఉంటే నవ్వుల పాలౌతాం. సాహిత్య పుస్తకంలో సమయం ఉంటుంది కనుక తక్కువ ఉంటాయి. అందుకే పత్రికా రచనని ‘పరిగెత్తే సాహిత్యం’ (literature in a hurry) అంటారు.
రాసే పత్రకారులలో బద్ధకం వల్ల వచ్చే తప్పులు జరిగిన విషయం (fact) సరిగా తెలుసుకోకపోడం, పేర్లు తప్పు రాయడం, అంకెల తప్పులు (కూడిక, తీసివేయడం, విభజన మొదలైనవి అవవచ్చు. రిపోర్టర్ దృష్టి వార్త మీదే కేంద్రీకృతం అయి వీటిని నిర్లక్ష్యం చెయ్యడం కొంత వరకూ జరగవచ్చు. అందుకే దిద్దేవారు (సబ్ ఎడిటర్లు) అవసరం. No copy is beyond editing అన్న సూక్తి అందుకే పుట్టింది.దిద్దటంలో చేసిన మార్పులు రచనని మెరుగు పరచడం, నేపథ్యం తెలపడం, మాత్రమే చెయ్యాలి. ఇంతకు మించితే రిపోర్టర్ తో మాట్లాడి మాత్రమే చెయ్యాలని పదే పదే రాసేను కదా. ఎన్నో సార్లు చెప్పినట్టు .రిపోర్టర్ తప్పు తనకీ బ్యూరోకి ఇబ్బంది కలిగించవచ్చు కాని సబ్ తప్పు ప్రింట్ఔతుంది, పత్రికకే ఇబ్బంది కలిగిస్తుంది,
సబ్ బద్ధకం వల్ల ప్రచురించబడేవి తప్పు శీర్షికలు మాత్రమే కాదు, ప్రచారం లేని సంక్షిప్త పదాలు (abbreviations)కూడా. CPI అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికీ తెలుసు. కానీ TRF అంటే Total Fertility Rate అనీ NFHS అంటే National Family Health Survey అనీ ఎంతమంది చెప్పగలరు? ఇలాటివి ఇంగ్లీషు పత్రికల్లో ఈమధ్య చాలా ఉపయోగిస్తున్నారు. వారి భాషలో చెప్పాలంటే ఇవి LSH (lazy sub-editor headlines).నా ఉద్దేశం ప్రకారం చిన్న, పెద్ద ఏ టైప్ లోనైనా ఏ విషయం మీదైనా శీర్షిక రాయ వచ్చు – కొన్ని సార్లు చాలా శ్రమపడాలి.శీర్షిక రాయడం కళ.
ఇది అలవాటు మీద కూడా ఆధారపడి ఉంటుంది. నా 64ఏళ్ల పత్రికా జీవితం చాలా మటుకు రాయడం లో గడిచినా కొన్నేళ్లు ఎడిటింగ్ చెయ్యడం వల్ల అలవాటై నేను రాసిన Random Jottings columnకి 40-50 సార్లూ సంక్షిప్తపదం వాడకుండా శీర్షికలలో రెండు వరుసలూ ఒకే పొడగువి కుదిరాయి (అప్పుడప్పుడు ఒకటో అరో పోయింట్ తేడాతో). ఇది నా గొప్పతనం కాదు – అనుభవం, హేండ్ కంపోసింగ్ నేర్చుకోడం వల్ల సాధ్యం అయింది.
సంస్కృతి మారినా అనుభవం విలువ ఉంటుంది, ఏ సందర్భంలోనైనా.