‘పెన్యురీ’ అనే పట్నం -26
By Someswar Bhagwat
మన దేశం మన పత్రికలు
మనదేశం ఈ భూప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వ్యామ్య మనీ, బర్మా పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, ఖండహర్ వేరైన తరవాతకూడా ప్రపంచంలో చైనా వదిలి అన్నిటికన్నా పెద్దదనీ అందరికీ తెలుసు. మనకి మరో విషేషత కూడా ఉంది. ప్రపంచంలో రెండు భాషల కెనడా లాటి బహుభాషా దేశాలు చాలా తక్కువ కానీ మన ఒక్క దేశంలో నే 22 ముఖ్య (national) భాషలు. ఇంకా ఎన్నో చిన్నవీ, అవి కాక వందలు మాండలీకాలూ ఉన్నాయి.
ఇందువల్ల దేశవ్యాప్తంగా కొనబడే దిన పత్రికలు ఒక విదేశానికి చెందిన, దేశపు.ఒకప్పటి బానిసత్వం గుర్తుకు తెచ్చే, ఇంగ్లీషు దినపత్రికలు మాత్రమే. ఏ ప్రాంతీయ పత్రికా కోట్ల ప్రతులు అమ్మబడదు. రాష్ట్రానికి అంతటికీ ప్రాతినిధ్యం చెయ్యగల పత్రికలు లేవు.
రాజ్ కోట్ గుజరాతీ పత్రిక ‘ఫూల్ ఛాబ్’ సూరత్ లో ఎవరూ కొనరు. సూరత్ లోని ‘గుజరాత్ మిత్ర’ జామ్ నగర్లో ఎవరికీ అఖ్ఖరలేదు. రెండూ గుజరాతీ భాషలోనే ఆదే రాష్ట్రంలో వెలువడుతున్నాయి. అలాగే లోక్ మాన్య తిలక్ మొదలుపెట్టిన ‘కేసరి’ దిన పత్రిక పుణే లో ముఖ్య మరాఠీ పత్రిక, కానీ మహరాష్ట్రలోనే విదర్భ ప్రాంతం లో నడవదు.
ఇలా ప్రతి ఫ్రాంతానికీ ఒక ప్రాంతీయ పత్రిక.ఉంటుంద. అమెరికా లాటి పెద్ద దేశంలో భాష సమస్య లేకపోడం వల్ల New York Times, Washington Post, New York Herald Tribune, Christian Science Monitor వంటి పెద్ద పత్రికలు నడుస్తున్నాయి. వీటికి పెద్ద ఆదాయం, ఎక్కువ వనరులూ ఉండటవల్ల ఎన్నోదేశాలలో ప్రతినిధులనూ ఫొటోగ్రాఫర్లను ఉంచ డానికి, నికోలస్ క్రిస్టాఫ్ వంటి పెద్ద రచయితలని ప్రపంచంలో ప్రతి జాగాకి పంపడం వీలౌతున్నది.
ఇలాంటి పెద్ద దిన పత్రికలు ఇంగ్లండ్ లో లండన్ టైమ్స్, దిగార్డియన్ , ఫ్రాన్స్ లో LeMonde (The World) జపాన్ లో అషై షింబున్ మరియు ఆస్ట్రేలియాలో ది ఆస్ట్రేలియన్. వీటితో పోలిస్తే మన National పత్రికలు దిటైమ్స్టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందు, హిందుస్థాన్ టైమ్స్, దీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ నాలుగూ కూడా national (పేరుకీ మాత్రం) అనాలి. .అవి నాలుగూ విదేశీ భాషలోనే ఉన్నాయి. దేశ భాషలలో ఉన్నవన్నీ ప్రాంతీయమైనవే.
పెద్ద పత్రికలలో ఎక్కువ డబ్బు మంచి వనరులు, అన్నిశాఖలలోనూ ఎక్కువ మంది బాగా నైపుణ్యం ఉన్న పనివారు (more number and better skilled workers) ఉంటారు, ఆధునిక, మంచి పరికరాలుంటాయి. అందు వల్ల పని పోటీలోనూ,ఆర్జించడంలోనూ కూడా వారు ముందు ఉంటారు.
కానీ దీని వల్ల కీడు కూడా జరగవచ్చు. ఇక్కడ ప్రలోభాలు ఎక్కువ ఉం డ వచ్చనీ , ‘డబ్బుకి వార్తలు’ (paid news)అనే దురాచారం ఒక పెద్ధపత్రిక లోనే పుట్టిందని అంటారు. ఆకలికి అలవాటు పడిన ఆదర్శవవాదులు చిన్న పత్రికలలో ఉంటే పెద్ద సేఠ్లే కోట్లు పెట్టి పెద్ద పత్రికలు పెట్టిగణించడానికి చూస్తారని ఒక ద్రృక్పథం. బాగా ఉన్ళవాళ్ళేఏమైనా చేసి ఇంకా ఆర్జించ చూస్తారనీ అంటారు .ఇది నిజం కూడా.
కొత్త నడవిడకలకీ ఈరంగం సంస్కృతి కీ సంబంధించిన విషయం మరొకటీ ఉంది. అషై షింబున్ జపాన్ లో ఫేక్సిమిలీ.టగక్నోలజీ వాడి ఒకచోటజప తయారైన పేజీలను వేరువేరు చోట్ల ముద్రణ చెయ్యడం కనిపెట్టారు. ఇండియాలో దీన్ని ప్రధమంగా ది హిందూ మొదలు పెట్టి వేరువేరు పట్నాలనుంచి సంస్కరణలు (editions) ప్రచురించడం మొదలు పెట్టారు. ఈ పెద్ద దేశంలో పత్రికలు ఎదుర్కొంటున్న మఖ్య సమస్య logistics — దూరప్రాంతాలు తెల్లవారే లోపున చేరడం. ఫేక్సిమిలీ తంత్రం, తన విమానాలూ దీనికి పరిష్కారం. ది హిందూ ఈ రెండు విధానాలలో ముందడుగు వేసింది: దేశంలో మొదటి విమానాలు (హెరోన్) కొన్న పత్రిక అయి పెద్ద డబ్బు ఉండటంతో మంచి కూడా జరగవచ్చని నిరూపించింది. ఈ సందర్భంగా అసలు విషయం నుంచి తప్పుకుని ఒక హాస్య సంఘటన చూద్దామా? ఆస్ట్రేలియా దేశంలో ముందు ఒక దేశవ్యాప్త మైన పత్రిక ఉండేది కాదు. అన్నీ స్థానికమే. అంటే ఒక జేబు దొంగని పట్టుకుంటే మొదటి పేజీ వార్త — సగం పేజీ దొంగ-పోలీసు ఫొటోలు. మిగిలిన సగం పోలీసుతో ముఖాముఖీ (interview). అదే మన దేశంలో అయితే లోపలిపేజీలో ఓ పేరా.
‘ది ఆస్ట్రేలియన్’ 1960sలో మొదలు పెట్టారు. అది ఒక రాష్ట్రంలో ఉండేది. తక్కినమూడు రాష్ట్రాలో ఎడిషన్లు ఉండేవి. అప్పటికి. ఇంకా పేక్సిమిలీ తంత్రం రాలేదు. ఆస్ట్రేలియా భూఖండం మధ్య అంతా ఎడారి కాబట్టి పెద్ద విమానాలు మాత్రమే ఎగర గలవు. అప్పుడు ముద్రణ కూడా వేరు. ప్రతి పేజీకీ ఒక ‘కాలని అట్ట’ మీద మణుగుల బరువుతో నొక్కి ‘ఫ్లాంగ్’ తయారు చేసేవారు. ఈ ఫ్లాంగ్ నుంచి ప్లేట్ తయారు చేసి దాన్ని రోటరీ మెషీన్ లో ఫిట్ చేసి ప్రింట్ చేసేవారు. విమానాశ్రయం చేరడానికీ, ఎడారి దాటడానికి సమయం పట్టేది. కాబట్టి పేజీలు తప్పులు దిద్దకుండానే ఫ్లాంగ్ లు తయారు చేసి విమానాశ్రయంకి పంపించేవారు. ఆతరువాత ప్రూఫ్ లుదిద్ది గంటల తరవాత తప్పులు లేకుండా మళ్ళీ ఫ్లొంగ్ తయారు చేసి సిటీ ఎడిషన్ ముద్రించేవారు. అందులో తప్పులు తక్కువ.
అసలు ఆశ్చర్యం ఇప్పుడుంది. కరెక్టైన Melbourn edition కన్నా తక్కిన మూడూ చాలా జనప్రియం అయి ఎక్కువగా అమ్ముడు పోయేవి. కారణం: ఆ ఊళ్ళలో ‘ఆస్ట్రేలియన్లో తప్పులు పట్టడం’ పోటీలు జరిగేవి.
ఒకరు “మొదటి కోలం లో 23 తప్పులు పట్టాను” అంటే మరొకరు “కాదు. నేను 32 లెఖ్ఖ పెట్టేను” అనేవారు; ఎవరక్కువ కనిపెడితే వారు గెలిచారనమాట. మన దేశంలో ప్రతి notional ‘hinglish’ daily లో ఇలాటి స్పెలింగ్, గ్రామర్. తప్పులు ఎన్నో.
మనకి వార్త తెలిస్తే చాలు. తప్పులు మామూలే. ఇదే సంస్కృతిలో బేధం.