www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -27

By Someswar Bhagwat

తప్పులు దిద్దుకోడానికే

ఈమధ్య చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మనకి స్ఫూర్తిని. కలిగించడానికి. మనిషికి తప్పులే పాఠాలు నేర్పుతాయనీ‌, విఫలమే సఫలతకి దారి చూపిస్తుందనీ, పడడం తప్పు కాదు కానీ తిరిగి లేవడానికీ ప్రయత్నం చెయ్యకపోడమే పెద్ద తప్పు అనీ, నూరుసార్లు తెగిన గూడు  మళ్లీ కట్టుకున్న సాలెపురుగు ఒక రాజుకి పాఠం నేర్పడం ఇలా ఎన్నో మోటివేషన్ స్పీకర్లు, TED Talks, self-help books, సామాజిక  మాధ్యమ posts మనకి చెప్తాయి. వాట్సప్,  గుడ్ మార్నింగ్ సందేశాలుకూడా ఈరోజుల్లో సందేశాత్మకమైపోయేయి.


వార్తల్లో ఎవరేనా గొప్పపని చేసారని వస్తే ఆవార్తకి మంచి జాగా ఇవ్వడం త్మూరలే.  ఒక  ఆఫీసర్  ఒక పత్రికకి రాసేడుట: “బాబూ ‘రిక్షావాని కూతురు IAS ఆఫీసర్’  వంటి వార్తలు ఆపండి. నన్ను రిక్షా లాగమని మా అమ్మాయిలు అంటున్నారు,”అని. ఈజోక్ ఎలాఉన్నా ‘సందేశాత్మక’ వార్తలని ప్రతీ పత్రికా  తప్పక ప్రచురిస్తుంది.  ‘పెరుగుట విరుగుట కొరకు’ లాగే ‘తరుగుట ఎదుగుట కొరకే’- కాని అంతే నిజం ‘సబ్ఎడిటర్ తప్పులు ప్రింట్  ఔతాయి’ ఆన్నది. కాబట్టి పత్రకారులు తప్పులు చేసి, నేర్చుకోవాలి, కొత్త తప్పులు చెయ్యడానికీ. 


ఎప్పుడూ ఏతప్పూ చెయ్యలేదనడం,  తను చేసిన ఘనకార్యాలని ఏకరువు పెట్టడం పత‌్రకారులకి మాములే. ఒక మిత్రుడు (Times of india చినూ పాంచాల్) అందరూ కలిసినప్పుడు అడిగే వాడు  “తమ గొప్పలు అందరూచెప్పుకుంటారు. మీరుచేసిన  పెద్ద  తప్పులు చెప్పండి.” తనతోనే మొదలు పెట్టడానికి చెప్పిన క్టధ: టైమ్స్ కంటే ముందు తను The Statesmanకి బరోడా విలేకరి. ఒక రోజు బరోడా (ఇప్పుడు అసలు పేరైన  వరోదరాకి మార్చారు) ఝా (వన్యప్రాణుల జాగా) కి ఫోన్ చేస్తే చెప్పారుట ఒక పులి పిల్లలు పెట్టిందని. ఇతను  వెంటనే అడిగాడు, “ఏ రంగు?” అని అడిగితే వచ్చిన జవాబు “లైట్” అతనికి “వైట్”  అని అనిపించింది. అతను ఆ వార్త  టెలిగ్రామ్.పంపించేడు (ఆ రోజులు fax, email, WhtaApp లేవుగా)


మూడవ రోజు అతని దగ్గరికి ఒకవ్యక్తి వచ్చి అతని ముఖం మీద ఎన్నో టెలిగ్రామ్ లు విసిరి అన్నాడు “వీటికీ జవాబు ఏమిటి?” అవి ప్రపంచంలో మొదటి తెల్ల పులి భారత దేశంలో కనిపించిన రోజులు. అప్పుడు తెల్ల పులి చాలా పెద్ద  ప్రపంచ వార్త.ఈవార్త ప్రపంచంలో ఎన్నో దేశాలలో ప్రచురితం ఐనది – దిస్టేట్స్మెన్  ని ఉదహరిస్తూ.


ఆ టెలిగ్రాములు తెచ్చిన మనిషి కూడా సామాన్యడు కాదు. విశ్వవిఖ్యాతి చెందిన వన్యప్రాణుల నిపుణుడు రూబెన్ డేవిడ్. తరవాత పాంచాల్, డేవిడ్ కూడా రాజీనామాలు చేసి గుజరాత్ రాజధాని అమ్దావాద్ (ఇంగ్లీష్ లో Ahmadabad) చేరుకున్నారు. 

నేను అమ్దావాద్ లో గుజరాత్ మొదటి ఇంగ్లీషు దినపత్రిక పెడుతున్న రోజుల్లో డేవిడ్ బాగా పరిచయం అయాడు. ఒక సంఘటన ఏమీ సంబంధించినది కాక పోయినా ఇక్కడ ప్రస్తావిస్తాను. రూబెన్ డేవిడ్ అమ్దావాద్ లో విఖ్యాతమైన బాలవాటిక నెలకొల్పారు. అందులోనే భాగమైన ఝూలో ఒకరోజు  ఒక పులిబోను  ముందు  నిలబడి బొట  బొటా  కన్నీరు కారుస్తూ అతను కనిపించేరు. చాలా నెలల తరవాత కలిసిన అతను అలా ఉండడంతో ఆత్రుతగా అడిగాను ఏమయింది అని. అతను నా భుజం పట్టుకుని తన గదికి తీసుకెళ్లి బేటరీ లైట్లా కనిపించే ఒక పరికరాన్ని తన గొంతుకకి ఆనిస్తే ఆ గొంతుకలోంచి ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది. ఆ మెటాలక్ గొంతకతో అతను చెప్పారు. తనకి గొంతు కేన్సర్ రావడం వల్ల    అతని ఫేరింక్స్(pharynx) తీసెయ్యబడింది. అతని అసలు గొంతు అన్ని జంతువులకీ తెలుసు. అన్నిటికీ అతను పేర్లం పెట్టారు. పేరురుతో పిలిస్తే క్రూర జంతవులతో సహా అన్నీ కటకటాల నుంచి తలలు బయట పెట్టేవి. అతను ప్రేమతో నిమిరే వారు. అతను దుఃఖంగా “ఇప్పుడు నాగొంతుక అవి పోల్చలేవు. వాటిని నేను పేర్లతో పిలవలేను” అంటూ ఉంటే నాకు కూడా కన్నీరు ఆగలేదు-


 “బోన్లబైట ఉన్న (రెండు కాళ్ళ) జంతువులే ఎక్కవ క్రూర మైనవి” అని అతిపేరు పొందిన Illustrated Weekly of India ముఖ పుష్ట ముఖాముఖిలో చెప్పిన భారీశరీరం మనిషైన రూబెన్ డేవిడ్ ఇప్పటికీ తలుచుకోగానే కంటినీళ్ళు తెప్పిస్తాడుపఅలాంటి గొంతే కొన్నేళ్ళ తరవాత నేషనల్ హెరాల్డ్ సంపాదకులు M.చెలపతి రావు నుంచి విన్ళొను. అది మరొక విషాద గాధ.

ప్రతి జర్నలిస్ట్ కీ తన తప్పులూ ఇలాటి కదిలించే కధలే ‘చివరకు మిగిలేది’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here