www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -28

By Someswar Bhagwat

అసంబద్ధ ప్రలాపం తోవ తప్పిస్తుంది

జర్నలిస్టుల కీ పత్రికా  ప్రవంచానికీ ఏ సంబంధం లేక పోయినా కన్నీరు  కలిగించే కధకింద   రూబెన్  డేవిడ్   గురించి  రాసీన   సందర్భంగా ఒక సంగతి చెప్పాలి.  అసలు విషయంతో ఏ సంబంధం లేని విషయాలని రిపోర్టర్  తన రచనలో చేర్చినా వాటిని తీసి వేయడం సబ్ ఎడిటర్ పని.రిపో‌ర్టర్ లేక సబ్ అలాంటి విషయాలు చేర్చడానికి కారణాలు రెండు: సరైన అవగాహన లేకపోవడం,  లేక తన జ్ఞానాన్ని ప్రదర్శన చెయ్యడం.

రూబెన్ ఎప్పుడూ తెల్లబట్టలే వేసుకునే వారనీ‌ దేశంలో పార్సీలకన్నాతక్కువ ఉండే జ్య్యూ (Jew) మతస్తులలో నాకుపరిచయం ఉన్న ముగ్గురిలో ఒకరనీ నేను రాయవచ్చు కాని ఇవి అతని జంతువులప్రేమతో సంబంధం లేని సంగతులు. అతని స్థూలకాయం కూడా అంత ‘పెద్ద’ మనిషి కన్నీరు కార్చడానికి సంబంధించినది కనుకనే ఉల్లేఖించబడింది,  అనవసరమైనది కాదు (నా  దృష్టిలో).

అనవసరమైన విషయాలు రాయడం వల్ల రచయిత  గొప్పతనం‌ తెలియ వచ్చు‌ చదదవరి జ్ఞానం పెరగవచ్చు. కానీ చెప్తున్న విషయం నుంచి దృష్టి మళ్ళ  వచ్చు కూడా. రాయడం ఉద్దేశం దారి తప్పుతుంది. కొందరు మాటల్లో కూడా అనవసరంగా విషయాలు చెప్పి దారి మరిచిపోతుంటారు. ఎడిట్ చెయ్యడం ముఖ్య ఉద్దేశ్యం ఇది సరి చెయ్యడమే‌ తప్పులు  దిద్దడం  కాదు. 

దిన పత్రికలలో రాయడం‌ ఎడిట్  చెయ్యటం రెండింటికీ ఒకటే లక్ష్యం — ఏ విషయం జరిగింది, దాని నేపథ్యం ఏమిటి‌, దానివల్ల ఏమిజరగబోతున్నదీ (impact) వీలైనంత ఆసక్తికరమైన విధమైన రీతిలో అందరికీ బోధపడే విధంగా చెప్పడం, తన తెలివితేటలూ‌,పాండిత్యం  ప్రదర్శించడం కాదు. అలాగే పాఠకుల జ్ఞానం   (general knowledge) పెంచడం కూడా కాదు.    వాటికి  వేరే సాధననాలున్నాయి. అందుకే అది నేర్పే విభాగాలని mass communication departments అంటారు.

రాసి డెస్క్ కి రిపోర్టర్ పంపే ముందు‌, ఎడిట్ చేసి డెస్క్ ప్రముఖుని కో కంప్యూటర్ మీద పేజీ సెట్ చేస్తున్న మనిషికో సిస్టమ్  మీదే forward  చేసే ముందు తనని తనే  అడగవలసిన మూడు ప్రశనలు:1.ఈవిషయం అసలు వార్తనుంచి దృష్టి మళ్ళిస్తుందా?2. ఇది చెప్పడం వార్త ప్రాముఖ్యత ఎక్కడ ఔతుందా 3.దీనివల్ల జ్లరిగేది  (impact) ఏమిటి?

ఇవి కాగితం మీద రాసుకుని అడగఖ్డర లేదు; మన ఆలోచనలో ఉండాలి. నేను రాసిన రూబెన్ డేవిడ్ కధకే ఈ మూడు ప్రశ్నలూ అన్వయించి చూద్దాం. పత్రికా రచన విధానాలకీ రూబెన్ కన్నీటికీ ఏ సంబంధం లేకపోడంవల్ల ఇది అసంబద్ధమే. ఆ విషయం మొదటే చెప్పబడింది.  కానీ దీన్ని జర్నలిస్టుల జ్ఞాపకాలతో ముడిపెట్టడంవల్ల అసంబధ్ధ మైనా ప్రలాపన కాదని మనసుకి నచ్చచెప్పుకోవచ్చు. 

రూబెన్ స్థూలకాయం ప్రస్తావన అనవరమేమో. మనిషీ ‘పెద్ద’ ఐనా కాకపోయినా కన్నీరు కన్నీరే. మనకు “కళ్ళకికట్టినట్టు” ఉండటానికి అతని తెల్ల బట్టలు ఎక్కువ పనికి వచ్చేవేమో. మనుషులు ‘మనోచిత్రాల భాష’లో ఆలోచిస్తారనీ‌, మంచి రచనలు మనసు లోదృశ్యాలు కలిగించాలనే  నమ్మకం వల్లే అతని స్థూలకాయం ప్రస్తావించేనేమో. మనం చాలా విషయాలు భాషలలో కాక చిత్రాలలో ఆలోచిస్తాం. మస  సంస్కృతి మన జ్ఞాపకాల మీద ఆధారపడి ఈ చిత్రాలు ఉంటాయి. అతని Illustrated Weekly interview పేర్కొడానికి కారణం అతన వ్యక్తిత్వం గురించి తెలపడం ఒకటఘఏ కాదు. అప్పుడు ఆ ప్డత్రిక ఎడిర్ A.S. Raman అని రాసుకునె తెలుగువాడు ఆవధానం సీతా రాముడు. 

అప్పుడే మొదలైంది కొత్య సంస్కృతి — తెలుగు వారు మరో భాష ముసుగు వేసుకునే  సంస్కృతి. ఆరోజులలోనే ఒక న్యూస్ ఎడిటర్ ని “మీరు తెలుగు వారా?’ అని గుజరాత్ లో అడిగితే వచ్చిన మరపురాని జవాబు “Yes I Speak that bloody language”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here