www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -29

By Someswar Bhagwat

చిన్న పత్రికలు, పెద్ద సంపాదకులు

పత్రికా రచనని “తొందరలో ఉన్న సాహిత్యం” (Journalism is literature in a hurry) అని మొదట ఎవరన్నారోకాని అది స్థరపడిపోయింది. వారి  పేరు మరుగునపడినట్టే మనం ఎందరో  సాహిత్య మేధావులనే మరిచి పోయాం.  అలాటప్పడు  గొప్ప పాత సంపాదకుల గురించి రాయడం కష్టమే. కాని ఈనాటి జర్నలిజంకి పునాదులు వారే వేశారు కనుక కనీసం జర్నలిజం విద్యార్థులైనా వారి పేర్లు  స్మమరించడం పరిపాటి.

రైట్ ఆనరేబుల్  వి.  శ్రీనివాస శాస్త్రి గాంధీజీ తో round   conferenceకి లండన్ వెళ్ళిన మేధావి. అతను సర్ చిర్రవూర యగ్నేశ్వర చింతామణి (1880-1941) అనే తెలుగు సంపాదకుడిని  “ఇండియా జర్నలిజంకి పోప్” అని ఉద్బోధించారు.   పోప్ క్రిస్టియన్ కేథోలిక్ మతానికీ‌,  విశ్వంలో     దేశంగా పరిగణించ బడే ఒకేఒక పట్నం వేటికన్ అధిపతి. పోప్ ప్రపంచంలో ఉన్న కోట్లమంది, కేథోలిక్ మతస్థులకి పూజ్యుడు.వేటికన్ ఆదాయం తిరుపతి కన్న ఎక్కువ. అతనితో పోల్చబడ్డం చిన్న విషయం కాదు. 

సర్  సి.వై. విజయనగరం లో పుట్టి 14 ఏళ్ళకే విశాఖపట్నంలో  ‘స్పెక్టేటర్‘ అనేపత్రికకి సంపాదకుడు అయాడు. తర్వాత విజయనగరం మహరాజా  కాలేజీలో చదివేటప్పుడు ముందు రోజు ‘ద హిందూ‘ దైనిక సంపాదకీయం పూర్తిగా కంఠస్తం ఉండేదని ప్రసిద్ధి. ఆయన అలహాబాద్ (యు.పి) లో మదన్ మోహన్ మాలవ్య పెట్టిన daily ‘లీడర్‘ కి ప్రధాన సంపాదకుడై  కలాన్నే కత్తిగా  వాడి ఇంగ్లీషు వారిని ఎదిరించి, గాంధీజీతో మతబేధాలవల్ల వేరే పార్టీ పెట్టి UP లో విద్యామంత్రిగా, విరోధపక్ష నేతగా కూడా పనిచేసేరు.

జవహర్లాల్  నెహ్రూ తండ్రి మోతీలాల్  కొన్నాళ్ళు లీడర్ పత్రిక   డైరెక్టర్ల బోర్డు ఛైర్మెన్. అతనికి చింతామణితో మతభేదం  వస్తేమోతీలాల్ ఆ భవనమే వదిలివెళ్ళారు   — కోపంతో కాదు, పక్క గదిలో తనుంటే చింతామణి అంత నిర్భయంగా రాయ లేరని.  అభివ్యక్తి  స్వాతంత్ర్యానికి ఈ దేశంలో అన్నిటికన్నా పెద్ద ఉదాహరణ  ఇది. చింతామణి మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ (1930)కి విషేష అతిధిగా వెళ్లారు. ఇంగ్లండ్ రాజు ఇతన్ని 1939 లో ‘సర్’ బిరుదుతో  గౌరవించేరు.

ఇంతకు మునుపు అన్నతమ్ములు ఇదే వ్రృత్తిలో ఉండంగురించి రాస్తూ కోటంరాజు రామారావు (నెహ్రు దిన పత్రిక నేషనల్  హెరాల్డ్) అతని అన్న కె. పున్నయ్య (సింధ్  ఆబ్సర్వర్ కరాచి) గురించి ప్రస్తావించాను. పున్నయ్య దేశవిభజన రోజుల్లో హత్య చెయ్యబడితే రామారావుట్రైన్ నుంచి పడి మృతిచెందేరు. రావు కుమారుడు, నా మిత్రుడు విక్రమ్ రావు బరోడా కేస్ లో జార్జ్ ఫెర్నాండెజ్ తోపాటు ఇరికింప బడి ఎమర్జెన్సీ ఎత్తిన తరవాత ది టైమ్స్ ఆఫ్ ఇండియా  లో తిరిగిచేరి రిటైర్ ఐ లక్నోలో ఉంటున్నారు. 

మరొక పేరుపడ్డ సంపాదకుడు రచయిత కుందుర్తి ఈశ్వర దత్.

Any  fool can write  it takes a heaven-born genius to edit అని నాతో అన్న ఇతని గురించి కూడా ముందు చెప్పేను. ఇతను  ప్రముఖుల వ్యక్తిత్వం గురించి రాయడానికి పేరుపొందారు.రామారావ్ పుస్తకం The Pen As My Sword దత్  రాసిన The Street of Ink ఈ విభాగం విద్యార్థులు తప్పక చదవాలి. 

రామారావు తరవాత కూడా ఈ పత్రిక సంపాదకుడు తెలుగతనే. మణికొండ చలపతి రావు గురించి ముందు రాసేను. దేశం మొత్తంలో మంచి ఇంగ్లీషు రాస్తారని పేరుపడిన ఇతను ఢిల్లీ  కాకానగ‌ర్ లో ఉండి ఒక అనాధ ప్రేతగా గతించారు.   పెళ్ళి చేసుకోని. ఇతను  ప్రతి రోజులా morning walk కి  వెళ్ళి ఒక రోడ్డు పక్క టీ తాగుతూ ఉంటే.గుండె ఆగి  ప్రాణం  పోయోంది.  “ఎవరో మద్రాసీ చచ్చి పోయాడు,” అని టీకొట్టు యజమాని చెప్పగా ఎవరో పోల్చుకున్నారు.   ఒక పేరు పడిన తెలుగు సంపాదకుని కధ  ముగిసింది.  హెరాల్డ్ వదిలేట్లా  చెయ్యడానికి పత్రిక యజమానులు (కాంగ్రేస్ పార్టీ) అతన్ని హింస పెడుతున్న రోజుల్లో అతను పోయారు.

ఒకప్పుడు ఇంగ్లీషు పత్రికా ప్రపంచంలో దేశంలో మొదటి స్థాయిలో తెలుగు వారుండేవారు. క్రమంగా ఈ.సంఖ్య తగ్గి ఇప్పుడు   ఆస్థానంలో  ఎక్కువ  మలయాళీలు,   బెంగాలీలు ఉంటున్నారు. దేశంలో ఏ మూలైనా ఇంగ్లీషు  న్యూస్ పేపర్ ఉంటే అది జాతీయ షమైక్యతకి ఉదాహరణ  ఔతుంది. ఎవరికీ ఇంగ్లీషు  మాతృభాష కాదు. అందరూ సమానమే  

ఏ భాష. పత్రికైనా రమారమి అందరూ ఆ  మాత్రుభాషవారు ఉంటారు — అతను  తెలుగు వారు తప్ప. ఏ ప్రాంతానికి వెళ్తే ఆప్రాంతపు భాష , సంస్కృతి స్వంతం చేసుకుని, తెలుగు మాట్లాడుతూ రాయడం చదవడం రాని తెలుగు  వారు  మాత్రం  మరో భాష పత్రికలో పనచెయ్యడం  మామూలే. ప్రవాసాంధ్రులు మరాఠీ, ఒడియో, కన్నడ,హిందీ భాషాపత్రికలలో ఉన్నారు.

ఆజ్‘ (ఒకప్పుడు  బెనారస్) లాంటి పెద్ద పత్రికకి ప్రధాన  సంపాదకుడవడం గొప్పవిషయమే. ఈ.స్థాయికి ఎదిగిన ఒక తెలుగు వ్యక్తి   విద్యాభాస్కర్. అతన్ని  సేఠ్జీ (యజమాని) కుర్చీ తీసి పదవినుంచి తొలగించి మళ్లీ తీసుకుని రాడం గురించి ఇంతకిముందు రాసేను. అతని తమ్ముడు భీష్మ ఆర్య (నా గురు తుల్యుడూ‌, బంధువూ) మరొక హిందీ దినపత్రికకి de facto editor గా ఉండే వారు. నా ఇంగ్లీషు పుస్తకం (A TOWN CALLED PENURY- the Changing  Culture of Indian Journalism’) తన.మాత్రుభాష తెలుగు అనే కన్నడ జర్నలిస్ట్  కన్నడలోకి అనువదించారు  ఆ కన్పడ పుస్తకం పేరే (పెన్యురీ ఎంబ.పట్టణ)తెలుగుకి అనువదించి దీనికి వాడు తున్నాను.  అయ్యంగార్ కాబట్టే అతను తమిళ్ అనుకోవచ్చు.  ఇది అసలైన national integration.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here