సంపాదన తక్కువైనా సంపాదకులు ఎక్కువ
మన దేశంలో పత్రికా రచయితలకీ. సంపాదకులకీ (శ్ర మిక పత్రకారులు) .ఆర్జన తక్కువ. అదే స్థరం తెలివితేటలు సామర్ధ్యంతో IAS కాని పారిశ్రామిక రంగంలోకాని ప్రవేశిస్తే ఎన్నోరెhట్లు గణించ వచ్చు…మరీ మొద్దు దద్దమ్మలు ఈ రంగంలోకి రారుకదా? ఐనా లక్షల మంది పత్రకారులు అవడానికి (అందులో సంపాదకులు బహుకొద్ది) కారణం సమాజంలో వారికి ఉన్ళగౌరవ మర్యాదలు. పనిలో రాణించిన వారికి డబ్బు బహుమతుల కంటే అందరిలో పొగడ్త ఎక్కువఉత్సాహం కలిగిస్తుంది.
ఈ దేశంలో ఎందరో చాలా గొప్ప సంపాదకులు ఉన్నారు, ఉండేవారు..ఒక్కొక్కరి గురించి ఒక వాక్యం రాసినా ఎన్నో పేజీలు నిండి పోతాయి, కాబట్టి కొద్దిమందిని మాత్రం పరిచయం చేయ బడుతుంది.ఇంతకుముందు కొందరి గురించి రాసేను. పంపాలకులు మూడు రఖాలు: కొందరు ఎంతో సామర్థ్యం ఉండి కష్టపడి కిందనుంచి కష్టపడి మీదకీ వచ్చి వారి యోగ్యతమీద ఆ స్థాయికి చేరుకున్న వారు, కొందరు వారి ఆర్థిక స్థితి వల్ల, యజమానులై తమకు సంపాదకత్వం అంటగట్టుకుంటారు.
వ్యవస్థని కలంబలంతో మార్చగలమనే పిచ్చి నమ్మకంతో ఎన్నో ఏళ్ళు రెండో రకం సంపాదకులకి ఒకలేఖ శపంపేవాడిని.ఒక కాగితం జతచేసి:
Who is the Editor? I is the Editor Oh, are you? Yes, I are అప్పుడు తట్టింది: సామర్ధ్యాన్ని ఇంగ్లీషు తో ముడి పెట్టడం తప్పు. నరేంద్ర మోదీని చిన్నచూపు చూడడానికి కారణం ఇదే.
ఎందరో చాలా గొప్ప సంపాదకులు భారతీయ భాషలవారే. గణేశ్ శంకర్ విద్యార్థి, మాఖన్ లాల్ చతుర్వేది (భోపాల్ లో అతని పేరున దేశంలోని ఒకే జర్నలిజం యూనివర్సిటీ ఉంది)ప్రభాస్ జోషీ (ప్రభాత్ ఖబర్) ధర్మవీర్ భారతి (హీందుస్థాన్. హిందీ) తెన్నేటి విశ్వనాధం, నార్ల వెంకటేశ్వర రావు, ముట్నూరి కృష్ణా రావు (కృష్ణాపత్రిక) ఖాసా సుబ్బారావు(స్వరాజ్య)కె.ఎ. దామోదర మెనన్ (మాత్రు భూమి — మలయాళం) ఎస్.బాలసుబ్రమణ్యం (ఆనందవికటన్ – తమిళ్) డా. న. భ. పరుళేకర్.(సకాళ్ -మరాఠీ) మ.గో. వైద్య(తరుణ్.భారత్. మరాఠీ). గోపబంధు దాస్ (సమాజ్ – ఒడీయా) ఇలా ఎందరో ఉన్నారు, దేశం ప్రతి భాషలో. కాని మన బానిస సంస్కృతికి ప్రతీకగా వీరందరికంటే ఎక్కువ ఈదేశం లో ఇంగ్లీషు సంపాదకులకే పేరు.
ఇక మూడో తరహా సంపాదకులు. వీరికి సాహిత్యం, ఎడిటింగ్ రావలసిన అవసరం లేదు. డబ్బు పారేస్తే రాసేవారు కోకొల్లలు. ఇది మన పత్రికా సంస్కృతిలో వస్తున్న మరొక పెద్ద మార్పు – సంపాదకీయాలు రాయడం కన్నా ‘పెద్ద’ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు, గొప్ప advertisers తో:పరిచయం, సిబ్బందిని చూసుకోడం ( man management skills) ఇలాంటివి ముఖ్యంగా పరిగణించ బడడం. దీనికి ప్రతీక The Times of India యజమాన్లన్నది : సంపాదకులు కావాలి’:పత్రకారులు రాఅఖ్కరలేదు. (Wanted Editors, journalists need not apply.)