హ.హ.హ. ఎంత బాగుందో ఈ
‘నిరాశపరిచిన’ చెత్త బడ్జెట్!
By Roamer
మళ్ళీ వచ్చింది ప్రతి ఏడాది వచ్చే సమయం: దేశ బడ్జెట్ ఐనా ఏదైనా పెద్ద ప్రకటన ఐనా ప్రతిక్రియ ఒకటే – మీరు ప్రభుత్వ పక్షం ఐతే పొగడ్తలు, ప్రతిపక్షం ఐతే తిట్లు. వాస్తవానికీ, నిజానికీ దానితో ఏమీ సంబంధం ఉండదు. మరి పత్రికలలో ఈ ప్రతిక్రియలు ఎందుకో? పత్రికలవారికి కూడా ఇది ఆలవాటుపని (routine) ఐపోయి ఉంటుంది. అసలు వారు ఏ నాయకుడినేనా కలిసి రాస్తారో రాసిన తరువాత నాయకులకి చెప్తారో అనుమానం.
అందరూ ప్రతిసారీ .ఎలా ఏ తప్పూ లేకుండా ఉండలేరో
ప్రతిసారి తప్పులుచెయ్యలేరు. మన పక్షం తప్పు చెయ్య వచ్చు.అలాగే విపక్షాలు కూడా కొన్నిసార్లు మంచిపని చేసి ఉండవచ్చు. ప్రతిసారి వారిని తిట్టి, మనని మనం పొగుడుకోవడం సబబేనా? ఎప్పుడేనా విరోధ పక్షాన్ని పొగడక పోయినా కనీసం వారు అన్నది నిజం అని ఎవరేనా అన్నారా? నోరుజారి అలా అంటే వారు పక్షం మారుతున్నారేమో అని ఊహాగానాలు చేసేది ఈ పత్రికలే. పత్రికల నిస్పక్షపాత్రతపై ప్రశ్న చిహ్నం పెట్టింది పత్రికలే.
నేను దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ఫోన్ చేసి అనేవారు ” రావుగారూ నాపేరున ఒక ఘాటైన ప్రతిక్రియ రాసేయండి. మీకు తెలుసుగా నా ఉద్దేశం ఏమిటో “. నేను వార్తా సంస్థలో వింటూ ఉండేవాడిని, ఒక వరిష్ఠుడు తనకి బాగా దగ్గరైన మంత్రులకి ఫోన్ చేసి ఏ విధమైన ప్రకటన ఎప్పుడు చెయ్యాలో చెప్పడం. ప్రతి రాత్రీ అతనికి నిర్ధారిత సమయంలో కొందరు మంత్రులు ఫోన్ చేసేవారు.
అంటే దేశాన్నీ, కొన్ని రాష్ట్రాలనీ పత్రికల వారు నడుపుతున్నారనమాట..ఇది 75 ఏళ్ళ మన రాజకీయ సంస్క్రతి. దీన్ని మార్చడానికి ప్రయత్నంలోనే ఏపత్రికకీ దగ్గర కాని నరేంద్ర మోదీ పత్రికల వారితో తగువు తెచ్చుకోవడం జరిగింది
పత్రిక సంపాదకులకి దేశం నడపడం వారి పని కాదని, అది ప్రజలు గెలిపించిన నాయకుల పని అని బాగా తెలుసు. ఐనా వారు తమ వృత్తి ధర్మం పాటించక ఇలా ప్రభుత్వం నిర్వహించి తెరవెనుక కార్యక్రమాలు నడపడానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి మన నాయకులు తమపని డబ్బు గణించడం కాదని పరిపాలన అని మరిచిపోడం. రెండవది పులికి మనిషి రక్తం రుచి తెలిస్తే అది నరబక్షక మృగం (man-eater) ఐనట్టు, అధికారం చవి చూసిన పాత్రికేయులు అది వదులుకో లేకపోవడం.
పత్రికల పని జరిగింది జరిగినట్టు వార్త అందించడం, నిర్భయంగా వ్యాఖ్యలు రాయడం అని మళ్లీ ఎవరేనా చక్రాన్ని తిరిగి ఆవిష్కరించినట్టు (like reinventing the wheel) కనుగొనే వరకు ఇది ఇలాగే ఉంటుంది.
ఆరోజు ఎప్పుడు వస్తుందో?