www.theTelugus.com

పెన్యురీ’ అనే పట్నం -30

By Someswar Bhagwat

  శ్రమించిన వారెందరో  కాని        పేరుపొందినన వారు కొందరే

మన దేశం చాలా పెద్దది, కాబట్టి మన పత్రికారంగం కూడా పెద్దదే.అమెరికాలో  ‘కౌంటీ న్యూస్ పేపర్లన్ని కాకపోయినా    అక్షరాస్యతతోపాటు పత్రికల సంఖ్య కూడా పెరిగింది. ప్రతి పెద్ద ఊర్లో దినపత్రికలు ‘మొలుస్తున్నాయి’ రోజూ ఎన్నో పుట్టి.ఎన్నో బందవుతున్నాయి.అందుకే సంపాదకుల.స్థాయికి పెరిగిన వారినీ చాలా పేగరుగలవారిని మాత్రం  ప్రస్తావించేను. ఐనా ఇంకా ఎందరో ఉంటారు. వారందరూ క్షమించండి. నా  ఇంగ్లీషు పుస్తకంలో విస్తతంగా  రాసేను.
ఇంగ్లీషు సంపాదకులైన తెలుగువారిని కొంతమంది గురించి ఇంతముందు రాసేను. “పేరుకు నేషనల్ హెరాల్డ్ నాదైనా అసలు  అది (కోటంరాజు)రామారావుదే” అనినెహ్రూ అన్న రామా రావు‌, 14 ఏళ్ళకే సంపాదకుడైThe Pope of Indian journalism అనిపించుకున్న చింతామణీ. A. G. Gardner, Stephen Spender చేతప్రశంసించబడిన ఈశ్వర దత్త్  దేశంలో అందరు సంపాదకులకన్నా మంచి ఇంగ్లీషుకి ప్రసిద్ధి గాంచిన చలపతిరావు అందరూ తెలుగు వారే. తెలుగు విద్యా భాస్కర్ అప్పటి No.1 హిందీ ఎడిటర్


కాలేజీలో చదవనీ ఆతబీద గణేష్ శంకర్ విద్యార్థి (1890–1931) ఒక ప్రముఖ  హీందీ జర్నలిస్టు. లాలా దుర్గా దాస్ ది The Hindustan Times ముఖ్య సంపాదకుడు, INFA స్థాపకుడుఅతని కొడుకు ఇందర్ జిత్.ex-MP (ఛీఫ్ రిపోర్టర్ Times of India) అతని తరువాత సంపాదకుడు.   మరాఠీ సకాళ్  స్థాపక ఎడిటర్ డా. నారాయణ్ భికాజీ పరుళేకర్.కూతురు జర్నలిజం అమెరికాలో చదివినా పత్రిక శరద్ పవార్ తమ్ముడికి అమ్మబడింది.1877 మరాఠీలో మహాత్మా జ్యోతిబా ఫులే దీనబంధు దళితుల ఉధ్ధారణ కోసం స్థాపించారు. మరాఠీలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కేసరి, గో. గ. ఆగర్కర్  మరాఠదినపత్రికలు స్థాపించారు. 

ఒక  ఆంగ్ల దినపత్రిక ఫ్రీ ప్రెస్  జర్న ల్ ముంబై లో పెట్టిన తమిళ వ్యక్తి స్వామినాథన్ సదానంద్. అతని శీర్షిక  ‘Sons of toil under tons of soil’ వల్ల ఒక మూల సూత్రం పుట్టింది:చావుగురించి ఎపుడు సరదా శీర్షిక ఇవ్వకూడదు. అతను చెన్నైలో వరదరాజులు నాయుడు పెట్టీన Indian Express దైనికాన్ని కొన్నా తరవాత రామ్ నాధ్ గోయంకాకి అమ్మవలసి వచ్చింది.


బహూ పుస్తక.పాఠకుడిగా పేరు పడిన Sham Lal (1912-2007)    సంపాదకత్వంలో దిటైమ్స్ఆఫ్ ఇండియా చాలా పెద్దదై  అతని కోలం Life  and Letters ఆ పత్రికలో అతను రిటైర్ అయాకకూడా వచ్చేది.ఇండియన్ ఎక్స్పెస్  సంపాదకులలో  ప్రసిద్ధి పొందినది Frank Moraes (1907-1974). అతని తరువాత ఎమర్జెన్సీ లో సంజయ్ గాంధీ ప్రోద్బలంతో  S. Mulgoankar ని తొలగించగా  ఎక్స్పెస్ కి FinancialExpress కీ ఒకేసారి సంపాదకుడైన వి. కె. నరసింహన్ సంజయ్ నే ఎదుర్కొని ప్రసిద్ధి పొందారు. సెన్సార్షిప్ ఎదిరించి తన పత్రిక కేపేరుతెచ్చిన నరసింహన్ కి చెప్పకుండా ఎమర్జెన్సీ అయాక గోయంకా అతని పేరు ప్రింట్ లైన్ నుంచి తొలగించాడు. నిరసనగా అతను పదవికి రాజీనామా చేశారు. ఈఆఘాత పరిణామంగా అతను సత్యసాయి అనుయాయుడు అయి పుట్టపర్తిలో ఉండేవారు. సత్త సాయి తెలుగు భాషణలను అతనే అనువదించేవారు.చిన్నప్పుడుమార్క్స్ వాదైన VKN    ‘From Bapu to Baba’ పుస్తకం రాసేరు 1990లో. అతని కొడుకు వి. ఎన్.. నారాయణన్  ట్రిబ్యూన్, హిందుస్థాన్   టైమ్స్‌  సంపాదకుడుఐ ఒక scandal వల్ల రాజీనామా చేసేరు. 

బి.జి.వర్గీస్ మూడు పెద్ద పత్రికలలోనూ (టైమ్స్‌HT,   ఎక్స్పెస్) సంపాదకుడైఎన్నో పుస్తకాలు రాసేరు.కేరళనుంచి లోక్ సభకి నిలబడి ఓడిపోయాడు , (1977). డి.ఆర్.మంకేకర్ ఎక్స్పెస్,  టైమ్స్  లో సంపాదకుడిగా రిటైర్ ఐ  దిమదర్లేండ్  మొదటి ఎడిటర్ ఐ దేశం లో ఒకే ఒక విరోధపక్ష దినపత్రిక మొదలు పెట్టేడు. ఆయన భార్య కమల అతనితో ఒక పత్రికలో కలిస పని చే్సేరు. ఇద్దరూ ఎన్నో పుస్తకాలు రాసేరు. 
వీరంతా దిన పత్రికల  సంపాదకులు.   వీరుకాక ఎందరో దైనికాలు కాని పత్రికలకి సంపాదకులో‌, పత్రికలలో మరోస్థొయి  లోనో పనిచేసిన ‘కలం కార్మికులు’ ఎందరో .  

కొన్ని వార.పత్రికలు చాలా పేరు తెచ్చుకున్నాయి.

రుసీ కరంజియా దేశం లోని ప్రముఖ tabloid వారపత్రిక బ్లిట్ఝ్   కీ సంపాదకుడైతే అతని తమ్ముడు B. K. Karanjia Filmfare సంపాదకుడు. బాబూరావు పటేల్  పేరు పడింది ప్రశ్న-జవాబు కోలం కోసం. ఎల్.కె్.అడ్వానీ‌ Organiser ఎడిటర్ ఐతే అటల్ బిహారీ వాజ్ పాయీ దైనిక్ స్వరాజ్య, గ్వాలియర్ సంపాదకుడు. ఇద్దరూ వ్రుత్తిపరంగా పత్రకారులు.

Gunupati Medhavi Reddy, K Rangaswamy ఇద్దరూ దిహిందూ ఢిల్లీ  ప్రతినిధులుగా పేరు పొందేరు. ఇద్దరూ పాకిస్థాన్ పుట్టక పూర్వం అక్కడ పనిచేసీ ఆదేశంగురించి మంచి అవగాహన ఉన్నవారే.  అక్కడి తర్వాత మొదట బ్లిట్ఝ్ లో, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఆయన పని చేసేరు. వారిలాగే అజిత్.భట్టాచార్య కూడా పాక్ స్పెషలిస్టు.  

ఎక్స్ప్రెస్,టైమ్స్ కాకజైప్రకాశ్ నారాయణ్ గారి Everyman’s weekly  ఎడిట్ చేసేరు. ఇతను కొన్ని పుస్తకాలు కూడా రాసేరు..వీరుకాక గోపీనాథన్.నాయర్, సీ పి రామచంద్రన్, కె. ఎ..దామోదర్ మేనన్‌ ఎ..రాఘవన్, ఇందర్  మల్హోత్రొ సుధాకర్ భాటియా‌, జి. క్రృష్ణ ఇలా చాలా మంది మనదేశం పత్రికా ప్రపంచం పునాదులు గట్టి పరిచారు.


వీరుకాక జీవించి ఉన్న ఎందరో మహా మహులు.మన  జర్నలిజం ప్రపంచ స్థాయికి ఎదగడానికి దోహదంచేసారు.


                    —సమాప్తం—

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here