ఇంతే సంగతులు
By Someswar Bhagwat
నడవడం వల్ల లాభాలెన్నో, నడవలేని వారి బాధలెన్నో
పాతకాలపువారి కి ‘చివరికి మిగిలేది’ స్మృతులే కదా? ఈ స్మ్రతులలో చాలా ముఖ్యం పాతపాటలు. కొత్త పాటలు (అరుపులు?) రోత అనుకునే పాత వారికి ఈ పాతపాటలలో చూసేది వాటి ఉత్తమ సాహిత్యం, శ్రావ్య సంగీతంమాత్రమే కాదు వాటితో ముడి పడిన స్మ్రతులు కూడా. ఈమధ్య ఒకభాషణ విన్నాక ఈమూడూకాక మంచి పాటలవెనక ఒక ఫిలాసఫీ (ఆథ్యాత్మిక చింతన, ఉద్దేశ్యం) కూడా ఉంటుంది అని తెలిసింది.
దీని అర్ధం పాతపాటలు ఒక్క ముసలి వారికే కావాలని కాదు. సహగల్, తలత్, హేమంత్, ముఖేశ్, రఫీ, దక్షిణం లో ఘంటసాల, రాజ్ కుమార్ (కన్నడ) పాటలంటే ఇష్టపడే చిన్నవారు లక్షలు… వారికి ఇవి మధుర గీతాలు మాత్రం, స్మ్రతులు కావు.
ఫిలాసఫీ ఒక్క త్యాగరాజకీర్తనలు, పురందరదాస రచనలకి మాత్రమే సీమితం కాదు. కవి శైలేంద్ర పాటల ప్రేరణతో కేవలం అతని పాటలకోసం రాజ్ కపూర్ తీసిన ‘తీసరీకసం‘ సినిమా లో ఒకపాటలో అంటాడు “సజన్ రే ఝూట్ మత్ బోలో ఖుదాకే పాస్ జానా హై, యహా నా హథీ న ఘౌడా హై, యహా పైదల్ హీ జానా హై. (ప్రియా అబధ్ధాలాడకు. ఇప్పుడు దేముడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఏనుగూ లేదు, గుర్రం లేదు. నడిచే వెళ్లాలి)
దీని వెనుక ఉన్న అర్థం నడిచి వెళ్లడం అణకువ లక్షణం. ఏనుగుమీద చాలా గొప్ప వారు వెళ్తారు. గొప్పవారు గుర్రాల మీద వెళ్తారు. ఏనుగు, గుర్రం వారి స్థాయికి చిహ్నాలు. ఇవి (ego) అహంకారానికి కూడా చిహ్నాలు. దేవుని ముందు అందరూ సమానం అనే సందేశం ఈ పాటలో ఉంది.
పూర్వకాలంలో సైనిక దళాల ముందు వరసలలో ఏనుగులు ఆవెనక గుర్రాలు ఇద్దరి వెనక కాలి భటులు ఉండేవారు. అప్పడు,ఇప్పుడు కూడా కాలిభటుల సంఖ్య మీదే సైన్యం బలం నిశ్చయించ బడేది. భారత సైన్యం పరాక్రమాల చర్చ ఎప్పుడూ కాలిభటుల(infantry) గురించే కాని అశ్వదళాల (equistrian sqadrons) గురించి తక్కువ. కాలిబంట్లు అందరు సైనికులకన్న ఎక్కువ కష్టతరమైన జీవితం గడుపుతారు,
వీరిశిక్షణలో భాగంగా వీరు ఒకేసారి. ఎన్నో మైళ్ళు నడవ వలసి ఉంటుంది. ఆ నడక, ఏది ఎదురు వచ్చినాఎదుర్కో .గలిగే సామర్థ్యం వారిని సైనికులుగానే కాకుండా మానవులుగా కూడా ఒకటి రెండు మెట్లు మీదకి ఎక్కిస్తుంది.
నడకకి ఈరోజుల్లో రాజకీయ రంగు కూడా వేసి రాజకీయ పక్షాలు నిరసన కనపర్చడానికీ, ప్రజలకి (వోట్లకోసం) దగ్గర అవడానికీ వాడుకుంటున్నారు. వీటితోపాటే ఈ పదయాత్రలు బల ప్రదర్శన కూడా చెయ్యగలవు. వెనకే వస్తున్న వందకార్లు మూర్ఖప్డ్రజలని ప్రభావితం చేస్తొయి , మొదటో గేరులో నడిచి ఇంధనం రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేసినా.
ఆదిశంకరులు హిందూమత పునరుధ్ధరణ కోసం ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర నడిచి మతోధ్ధరణే కాదు భారత దేశ ఏకీకరణ కూడా సాధించారు. గ్రామరు పుస్తకం రాసిన వినాయక్ నరహరి భావే వినోబా అయాక భూదాన్ కోసం నడిచిన నడక, హిందువులు చేసే ‘పరిక్రమణ’ (ఒక నది పుట్టిన స్థలం నుంచి మొదలు పెట్టె అది సముద్రంలో కలిసే వరకూ నదీతీరాన్నే నడవడం), మొక్కు తీర్చుకోవడానికి భక్తులు చేసే నడక — ఇలా ఎన్నో రకాల నడకలు…. అన్నీ మంచివే.
ఈ నడకలన్నీ మనకి ఎన్నో. పాఠాలు నేర్పుతాయి: ముఖ్యంగా నడవడానికి కాళ్ళు లేనివారి దుస్థితి గురించి – ఇంగ్లీషు లో ఒక వాక్యం.ఉంది: తనకి మంచి జోళ్ళు లేవని ఉండే విచారం కాళ్ళే లేని మనిషిని చూసే వరకే.