www.theTelugus.com

ఇంతే సంగతులు

By Someswar Bhagwat

కళ్ళు ఎలా ఉన్నా చచ్చినవారిని ఎపుడూ పొగడాలి

ప్రతి భాషలో ఎన్నో సామెతలు ఉంటాయి. ప్రపంచంలో అన్ని భాషల కన్ళా ఎక్కువ‌ సామెతలు తెలుగులో ఉన్నాయంటారు. ఒక భాషలో ఉన్న సామెత అర్థమే ఇచ్చే సామెత  మరోభా‌షలో ఉన్నా అది దాని అనువాదం కాకుండా దానితో ఏమాత్రం పొందిక లేనిది అవొచ్చు,   ఉ: లేటిన్ లో .”de mortis nihil nisi bonum” అన్ళది,., దాన్ని  ఇంగ్లీషులో Nil nisi bonum అని  కుదించి   వాడుతారు.  దాని అ‌సలు అర్ధం”Of the dead, [say] nothing but good”,  (బతికి లేని వారి గురించి ఎప్పుడూ మంచే మాట్లాడాలి) ఐనా క్రమేపీ అది మారి  “చచ్చిపోయిన వారి గురించి చెడు చెప్పకూడదు’ (never speak Ill of the dead}  అయింది. దీన్ని  తెలుగులో ఎలా చెప్తారు? “అనువాదంలో  అర్ధం (మారి)పోయింది’ అని (lost in translation) అని ఇంగ్లీషులో అంటారు ‌‌‌‌‌‌‌Nil nisi bcnum తెలుగులో అనువాదం చేస్తే ‘చచ్చిన వాడికి చారడేసి కళ్ళు’ ఔతుంది,  ఎవరికేనా  కళ్ళు పెద్దవి అంటే అందగాడు అని అర్థం,….. అంటే పొగిడామనమాట.  చచ్చిపోయిన వాడి కళ్ళు చిన్నదైతే నాకేమిటి, పెద్ద వైతేనేమిటి. వాటి సైజు, ఆకారం ముఖ్యాంశాలు కాదు.  ముఖ్యం వాటిని ఉల్లేఖించడంలో ఉన్న ఉద్దేశ్యం  … అతని గురించి ‌ మంచి మాట్లాడుతున్నామా చెడా అన్నది ముఖ్యం .

 చెడు మాట్లాడక పోడానికి ఒక కారణం ఉందీ. ప్రతివ్యక్తీ తనని తాను రక్షించుకోవడానికి అవకాశం ఉండాలి అని ‌‌ఒక‌  నమ్మకం ఉంది, ఇది న్యాయవ్యకు ముఖ్యం సూత్రం కూడా. ప్రతి వ్యక్తి కి right of self-defence ఉంది అన్నది మానవాధికారాలలో ముఖ్యం. చచ్చిపోయిన వారు అది చెయ్యలేరుగా. అందుకే nil nisi bonum అనే సూత్రం వచ్చింది. విచారణ లేకుండా ఎవరినీ దోషిగా నిర్ధారించలేం. విచారణలో రెండు వైపులనీ వినాలన్నది ఇప్పుడు వకీళ్ళు డబ్బు చేసుకోడానికి మాత్రం పనికొస్తుంది. న్యాయస్థానంలో గెలుపు అర్ధం వకీలు తెలివికి తార్కాణం… వ్యక్తి నిర్దోషి అని కాదు. ఇది న్యాయవ్యవస్థ వక్రీకరణమే. నాలుగేళ్ళ పసిపిల్లని అత్యాచారంకి గురిచేసే చంపిన మనిషి మరణ శిక్ష తప్పించడం వకీలు తన రుసుము రెండు రెట్లు పెంచడానికి మాత్రమే  పనికొస్తుంది. ఇది ఈనాటి నిజం.


చాలా సామెతల కి అన్ని భాషలలోనూ సమానాంతర సూక్తులు  ఉంటాయి. వాటిలో గుడీ, దీర్ఘం కన్నా అర్ధం ముఖ్యం. భాషలు వ్యక్తీకరణ సాధనాలే కాకుండా సామాజిక వ్యవస్థకీ, సంస్కృతికీ ముఖ్య బిందువులు కూడా.

  
ఈ మధ్య ఒక తెలుగు కధ చదివాను. అందులో ప్రతి వాక్యం లోనూ ఒక సామెత వాడబడింది.  బహుశా ఇది తెలుగు లో మాత్రం సంభవమేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here