www.thetelugus.com

ఇంతే సంగతులు

By సోమేశ్వర్  

ఎప్పటికి  తెంచుకోగలO, ఈ మనసుకు ఉన్న సంకెళ్ళు?

అరవై  ఏళ్ళ  పూర్వానికి ఒక్కసారి వెళ్లి వద్దామా?  ఆనాటి జీవన శైలె వేరు  ఆ రోజూలలో ఎన్నో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి . ఒకరికొకరు ముఖం పరిచయం ఉండెడిది. ఇలా  ఫోన్ల మీద   సామాజిక మాధ్యమాల్లో కాదు.


వారాలబ్బాయిలు, వీథి దీపాల కింద చదువుకున్న వారూ    ప్రయోజకులైతే పొగిడే వాళ్ళు.   “వాడో ముష్టి వాడు” అని అవమానపరిచే చిన్న చూపు ఉండేది కాదు.


“కక్షలూ కార్పణ్యాలు,  కోప తాపాలు కుళ్ళూ కపటం ఉండేవి కావు .  ఈర్ష్యా ద్వేషాలు, వాళ్ళ కుంది, మాకు లేదని  ఏనాడూ అనుకునే వారే లేరు.   అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి,” అని శ్రీ  హర్షవర్ధన రావు ఒక పాత మిత్రుడి పాత జ్ఞాపకాలు సేకరించి పోస్ట్ చేస్తే ఒక పాత సినిమా పాట  మనసులో మెదిలింది: “కోయీ లౌటాదె మెరె బీతే హుఏ దిన్” (నా జరిగిపోయిన రోజులనెవరేనా తిరిగి ఇయ్యండి).
మనసును కదిలించే ఈ పాట ఒక అభ్యర్ధైన, ఆజ్నౌపన  కాదు  అలాగే “బచ్ పన్ కే దిన్ భీ క్యా దిన్ థే” (చిన్నప్పుడి రోజులు ఎంతో కమ్మని రోజులు) అనే పాట ఒక  ప్రశ్న కాదు, ఆశ్చర్య సూచకం (exclamation)! కొత్త విషయాలు తెలియడం వల్ల కలిగే ఆశ్చర్యం అది.


జీవితం అంటే ఒక ప్రశ్న కాదు. మనం దాన్ని ఆజ్నాపించ లేము. మనకి ప్రతి క్షణం ఆశ్చర్యం  కలిగించే, ఎక్కడికి వెళ్తున్నామో తెలియని ప్రయాణం జీవితం.

మరి ఈ మార్పు ఎలా వచ్చింది? వందల ఏళ్ల బానిస బతుకు వల్ల వచ్చిన పరిమాణం ఇది. స్వతంత్రం వచ్చినా   మానసిక బానిసత్వం కొన‌సాగుతూ ఉండటం వల్ల ఈ ప్రశ్నలు ఉద్భవిస్తాయి ఈ బేడీలు మనం తెంపుకోగలమా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here