www.theTelugus,com

ఇంతే సంగతులు by సోమేశ్వర్

మనమెన్ని మరిచిపోయినా మరిచిపోడం మరిచిపోలేం

మీరుఎప్పుడైనారాత్రి అంతా నిద్ర పట్టక పాత జ్నాపకాలతో  గది పైకప్పు చూస్తూ గడీపారా?
మీవయసు 60 ఏళ్ళకన్నా ఎక్కువ ఐతే అలాంటి రాత్రులు చాలా గడిపి ఉండాలి. తక్కువైతే అవి మధుర స్మ్రుతులు అయే అవకాశాలు ఎక్కువ.ఆధునిక విజ్ఞానం కనిపెట్టిన విషేషం పాత కొత్త జ్ఞాపకాలు నియంత్రణ మెదడు లోని వేరు వేరు భాగాలు చేస్తాయి.


అందుకే ‘వయసు మీరిన’ పెద్దలుకళ్ళజోడు కానీ, పర్సు కానీ  నిమిషాల  ముందు ఎక్కడ పెట్టిందీ మరిచిపోయినా, తమ బాల్యంలో జరిగిన  విషయాలని  కూ.డా మరిచిపోకుండా  చిన్న detailsతో సహా చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు వద్దన్నా.

 
కొన్నిసార్లు  చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్తారు కూడా,  నిమి…షాలకిందే తమేచెప్పిన  విషయం మరిచిపోయి. ఈ అలవాటు వయసుమీరినకొద్దీ  ఎక్కువై  భరించలేని స్థాయికి కూడా చేరవచ్చు.ఆలోచనలతో సంబంధించిన మరో అలవాటు ‘అనాలోచితం” గా జరిగే చర్యలు.  వీటిని  reflex actions అంటారు. కంటి దగ్గరకి వేలు తీసుకుని వెళ్లిన మరుక్షణం కంటిరెప్పలు మూత పడతాయి. “వేలు వస్తోంది, కన్ను మూసుకోవాలి”అని మెదడు అనుకుని మూసుకోమని కంటి  రెప్పలకి. నిర్దేశించే లోపలే కంటికి  హాని కలగవచ్చు.

‘వాయువేగం’ కన్ళా ‘మనోవేగం’ ఎక్కువ ఐనా ఆవేగం కూడా చాలదు.  అలాగే మనమీదకీ ఎవరేనా కత్తితో దాడి చేస్తే వెంటనె తప్పించుకోడం కూడా  అనాలోచితంగానే జరగాలి. ఆలోచించేసరికీ ప్రొణాలు పోవచ్చు. అందుకే ముఖ్యుల అంగరక్షకంలని (NSG, Special security etc.) నియమించేటప్పుడు ఆ జవాన్ల reflexes పరీక్ష చేస్తారు. కాని ఇందులో కూడా తప్పులు జరుగుతాయి. రాజీవ్ గాంధీ  పైన శ్రీ లంకలో జరిగిన హత్యా ప్రయత్నంలో అతని అంగరక్షకులకన్నా ఎక్కువ వేగంతో తనే కదిలి కత్తిపోటు తప్పించుకున్నారు. కొన్ని ్హసార్లు ఇంత జరిగినా పాఠం,నేర్చుకోరు.  శ్రిపెరంబదూర్ లో  సంయోజకులు తగినంత జాగ్రత్త  చూపకపోడంల్ల అతను ప్రాణాలు కోల్పోయారు. మన reflexes మెదడుకి వెన్నెముకకీ మధ్యలో ఉన్న  medula oblangata అనబడే. ‘చిన్నమెదడు’  నియంత్రణ చేస్తుంది. అంటే జ్ఞాపకాలకు మెదడులో మూడు  కేంద్రాలు ఉన్సాయి.


ప్రఖ్యాత మనోవైజ్నానీకుడు  సిగ్మండ్ ఫ్రోయిడ్ ప్రకారం కష్టం వచ్చినప్పుడు మనిషీ తనకి హాయిని ఇచ్ఛిన పాత సమయంలో ఎలా ఉండేవాడో అలా ఉండటానికి ప్రయత్నం  చేస్తాడు —  ఆ దశ ఎంత పాతదైనా.  Unconscious mind అతనిజ్ఞాపకాలను తల్లిగర్భంలో   ఉన్న దశ వరకూ వెనకకి  తీసుకళ్ళ గలదని చెప్పి.అందుకే మనిషి కొన్నిసార్లు foetal positionలో (తల్లి కడుపులో ఉన్నట్టు)  పడుకొంటాడని Freud అంటాడు.


మనిషిని పాత జ్ఞాపకాలు బాధకూడా పెడతాయి… హిందీ సినిమా పాటలలో (….యాద్ సతాయే)లాగా.   పాత వ్యామోహం  (nostalgia)  సుఖం లాగే దుఃఖం కూడా కలిగించవచ్చు.  సాహిర్ లుధియాన్వీ అంటాడుకదా :  తఅల్లుక్.(పరిచయం) బోఝ్.బన్జాయే.(బరువు ఐపోతే) ఉసే భూల్నా అఛ్ఛా (మరిచి పోడం మంచిది్)

సినిమా లలోలాగ  మతిమరుపూ‌, జ్ఞాపక శక్తి పోడం (temporary amnesia) కేలండ‌ర్ లో ఒక తారీకు నుంచి మరో తారీకు వరకూ  వచ్చి తలమీద ఠంగుమనిపిస్తే తారీకులు మారుతూ ఉండదు. పాత జ్ఞాపకాలను మరిచిపోడం ఎంతకష్టమో వాటి బరువుకింద నలిగిపోతూ జీవించడం అంతే కష్టం మరుపు.

ఇలాటి కష్ఠాలనుంచి మనని కాపాడే  రక్షణ పరికరం   (defence mechanism)  మాత్రమే.
కాబట్టి   మరిచిపోడం మరిచిపోకండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here