www.theTelugus.com

ఇంతే సంగతులు

సోమేశ్వర్ భాగవత్

మడి  దున్నుకు  బ్రతుక 

లేము మహిలో సుమతీ

“అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.” ఇది సుమతీ శతకంలోని ఒక పద్యం తాత్పర్యం.  ఈ  శతకం (100+ పద్యాలు) బద్దెన అనే ఒక రాజు (క్రీ,స్తు శకం  AD 1220-1280లో రాసినది డఅని వికపిడియా తెలుపుతోంది. అతను కాకతీయ సామ్రాజ్యంలో ఒక సామంత రాజయిన బద్దెన భూపాలుడు. శతక సాహిత్యం కేవలం తెలుగుభాషలోనూ, కన్నడంలోనూ  ఉందట.


ఇందులో తెలిసిన విషయాలు రెండు: 1. అప్పటి రాజులు ఇప్పటి రోజుల రాజకీయ నాయకులలా కాక అక్షర జ్ఞానం, నీతి రెండూ తెలిసిన వారు 2. ఆరోజుల్లో పొలం దున్నుకుని బతక గలిగేవారు, ఇప్పటిలా ఉరి పోసుకుని చావకుండా.


అప్పటి రాజులు పద్యాలు రాయడం, రచయితలని ప్రోత్సహించడం ఎలాగ ఎరుగుదురో అలాగే ఆరోజుల్లో ఎడ్లు కూడా త్వరగా నడవ గలిగేవి.  ఈరోజుఎడ్లజత (tractor) గడ్డి తినక డిసెల్  తాగి  పరిగెడుతుంది‌‌.   ఆ డిసెల్, ట్రేక్టర్  కొనే తాహతు లేకే అన్నదాతలు ఐన రైతులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారు,  తినబడని బంగారం, వజ్రాలు అమ్ముకునే వారు కోటీశ్వరులు  ఐపోతున్నారు. ఈ వ్యవ‍స్ధ ఎప్పటికి మారుతుందో… అనృ ధాన్యాలకి  కిట్టుబాటు  ధర లభించి బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో!


డబ్బు విలువ రోజు రోజుకూ  తగ్గి పోయి బంగారం  విలువ ఎక్కువ ఔతున్నన్ళాళ్ళూ ఇది ఇంతే.
పరిగెత్తి బంగారం దుకాణం  ముందుక్యూలో నిలబడండి – అక్షయ తృతీయ వచ్చేసింది.  బంగారం కొనాలి. మడి దున్నుకు బతకలేము మహిలో సుమతీ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here