ఇంతే సంగతులు
సోమేశ్వర్ భాగవత్
పనినేర్పని చదువు
వాసనలేని పువ్వు!
వైద్య విద్య MBBS పరీక్ష పాస్ అవడంతో పూర్తి అవదు – ఆతర్వాత కొన్నాళ్ళు ఇంటర్నీగా పని చెయ్యాలి. “ఇంజనీరింగ్ చదువు పూర్తయి ఉద్యోగం మొదలైనాకే అసలు నేర్చుకోడం ప్రారంభం ఔతుంది” అని అప్పుడే ఉద్యోగంలో ప్రవేశించిన ఒక ఇంజినీర్ అనడం నా మనసులో స్థిర పడిపోయింది.
కాని సోషల్వర్క్ డిగ్రీలకి (BSW, MSW) ఇంటర్న్ గా పనియ్యనవసరం లేదు. పరీక్ష పాసైతే చాలు. ఆ రెండూ పనికి సంబంధించిన కోర్సులు. వాటి పేరులోనే ‘పని’ ఉంది. ఈ డిగ్రీలకు ఇంటర్నెట్ షిప్ అనివార్యం చేసి, కనీసం ఆరునెలలు ఏ వృద్ధాశ్రమంలోనో, అనాధాశ్రమంలోనో పని చేయించడం అవస్థలు.
ఏ విశ్వవిద్యాలయమేనా ఇలాటి విద్యార్థులకు ఈ పనికి పంపే ముందు ఆ సంస్థ పనిచేసే విధానం బాగా పరీక్షించాలి. బాగుంటేనే ఇంటర్న్ నియామకం జరిగేది. అంటే ఇంటర్న్ లేని ఇలాంటి సంస్థ గుర్తింపు పొందినది కాదమాట. ఇంటర్న్ గుర్తింపు కి గుర్తు (recognition) అనమాట.
మనదేశంలో ఆస్పత్రిలో ఎక్కువ పని ఇంటర్న్ లే చేస్తారని, చాలా కేసులు డాక్టర్ వరకూ రావని ప్రతీతి. సంస్ధలు నడపడానికి సరైన నియమాలు లేవు. చాలా వాటిలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, నాయకుల అండ ఉంటే చాలని ప్రతీతి.
ఈ సంస్థల్లో పనిచేసేవారు చాలా ఎక్కువ ఉద్యోగాలు మారుతూ ఉంటారు. వారిపని ఏమిటో బోధపడే వరకేనా ఉండరు. ఇంటర్న్ ఉంటే ఒక పని విధానం (continuity) ఉంటుంది. ఈ రోజుల్లో NGO అనగానే ‘అక్రమ ఆర్జనా విధానం’ అనిపిస్తుంది. ఇంటర్న్ ఉన్న సంస్ధ అలాంటిది అవడానికి అవకాశాలు తక్కువ.
BSW, MSW కోర్సులు ఇంటర్న్ షిప్ లేకపోతే వ్యవహారిక జ్ఞానం ఇవ్వని విద్యలు – అంటే రంగు, రూపు, సువాసనా లేని పువ్వులు. ప్రతి విశ్వ విద్యాలయం ఇది గుర్తించాలి.