www.thethetlugus.com

ఇంతే సంగతులు by సోమేశ్వర్

మనకెన్నో గర్వకారణాలు: శ్రీ శ్రీ, 

అడివి,. విశ్వనాథ‌‌,  రాచకొండ…

మానవ చరిత్రలో ఏమున్నది గర్వ కారణం, అని మహాకవి శ్రీ,శ్రీ అడిగారు. యుధ్ధాలు‌, మారణహోమాలు మానవ చరిత్రలో నిండి ఉన్న మాట నిజమే. ఏ మతమైనా మానవ రక్తంతో తడిసి ఉన్నదే: రామాయణ, మహాభారతాలు యుధ్ధ గాధలే. ఇస్లాం హుస్సేన్, జిహాద్ లవల్ల ప్రవహించిన రక్తపు మడుగులని చూసాం‌,  స్వయంగా దేవుని పుత్రుడైన జీసస్ తనరక్తాన్ని మానవ జాతికోసం  రక్తం ధారపోసేడు. యుధ్ధాలలో జరిగిన మ్రుత్యువే అశోకుడి చేత బౌధ్ధధర్మాన్ని వ్యాపింపజేసింది.

అందుకే శ్రీశ్రీ మార్క్స్ మతం బుచ్చుకొని (కమ్మ్యూనిజం  కూడా  ఒక మతమేనని నా నమ్మకం) రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళీపట్నం రామారావు (కారా మాస్టర్) వంటి మేధావుల్ని  అనుయాయులుగా మార్చారు (అదికూడా మతంమార్పిడే). రాచకొండ, కారా  గారితో కలిసే నేను ఎమర్జెన్సీ లో శ్రీ శ్రీ పేరోల్ మీద విడుదలైనప్పుడు చూడగా నాకు తెలిసిన విషయాలు: శ్రీశ్రీ ధర్మపత్ని సాయిబాబా వంటి ధార్మిక విషయాల మీద సినిమా తీసారనీ, మార్క్స్ వాద  మూల స్థంభం EMS నంబూద్రిపాద్ భార్య పూజలు చేసేవారని, రావిశాస్తి ‘కాదేదీ  కవిత కనర్హం’ అని శ్రీ శ్రీ  list  చేసిన  అన్ని వస్తువుల  మీదా (సబ్బు బిళ్ళా‌, కుక్క పిల్లా మొదలైనవి)ఒకొక్క  కధ రాసేరనీ.

ఒక్క ‘రత్తాలూ రాంబాబు’ వదిలి అతని పుస్తకాలన్నీ చదివేను.

అప్పుడు తట్టలేదు కాని తరవాత ఒక కన్పడ మిత్రుడు తనతండ్రి తెలుగు, కన్నడ, భాషలలో మాత్రమే ఉన్న శతక సాహిత్యంమీద  Ph.D.  చేస్తున్నారని చెప్తే కొన్ని తెలుగు శతకాలు (వేమన‌, సుమతి‌, భర్త్రహరి మాత్రం)  అతని కోసం సంపాదించేను. 

ఆతరవాత మొదటీసారిగా (అప్పటి) ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే అవకాశం వస్తే, నాకు నాగపూర్లో పరిచయం ఉన్న విద్యుత్ ఇంజనీర్ నార్ల తాతారావు తమ్ముడు వెంకటేశ్వర రావు (అప్పుడు ఆంధ్రజ్యోతి నంపాదకుడు) రాసిన ‘నార్లవారి మాట’  పద్యాలు  చదివి అనిపించింది ఆ పురాతన సాహిత్య ప్రక్రియలో మళ్ళీ జీవం పోస్తున్నారని. అప్పటికే తెలుగులో రాయడం మానేసి ఎన్నో ఏళ్ళు అవటం‌‌, కాల్పనిక రచన (fiction) రాసే ధైర్యం లేక  ‘కారా’ గారి యజ్నం  ఇంగ్లీషులో రాసే యజ్ఞాన్ని విరమించుకోడం జరిగింది.

ఈమధ్య ఒక మిత్రుడు వేమన శతకం రోజుకీ ఒకపద్యం చొప్పున తాత్పర్య సమేతంగా పంపుతూ ఉంటే తట్టింది. అవి ఎలాగా నీతులే కాబట్టి ఒకొక్క పద్యం  మీద ఒక  వ్యాసం ఎందుకు రాయకూడదు?  మరొకరికి నీతులు చెప్ట్పటం వాటిని ఆచరించడం ఎంత కష్టమో అంతే సులభం.

మన ఇతిహాసంలో ఏమీ గర్వకారణం లేదన్పది నిజంకాకపోయినా, వారి మార్క్స్ వాదంతో  నేను  ఏకీభవించక పోయినా వారు తెలుగు సాహిత్యానికే గర్వకారణాలు అనిపిస్త్తుంది. 

వారే కాదు, విశ్వనాధ సత్యనారాయణ, అడివి బాపిరాజు‌,  ఇంకా ఎందరో గొప్ప  రచయితలు ఉన్ళ తెలుగుకి చాలా గర్వ కారణాలు ఉన్నాయి. తెలుగు వారు దేశంలోని అన్ని రాష్ట్రాలలో స్థిరపడి అక్కడి వారితో కలిసిపోయి ఎక్కడా అనుసంధాన సమస్య స్రుష్టించక  దేశ సమైగ్రతకి (to issue of national integration) అవరోధం కలిగించలేదన్నది గర్వకారణమే. ఎక్కడా తెలుగువారి  వ్యతిరేకంగా ఉద్యమం లేకపోవడం గొప్పే.

గొప్ప కానివల్లా తెలుగువారే తెలుగు చదవలేకపోడం,  ఒక సంయుక్త రాష్ట్ర (UNO)  నివేదికలో తెలుగుని చచ్చి పోతున్న భాషల జాబితాలో చేర్చడం. 

దీన్ని నివారించడానికి ఉద్యమం ఎవరు‌, ఎప్పుడు, మొదలుపెడతారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here