జీవితానికి రక్షణ కవచం
హాస్యం: పు.ల.దేశ్పాండే
by Someswar Bhagwat
చాలా బాగా చెప్పారు — హాస్యం నవ రసాల్లో ఎంత ముఖ్యమైనదో చార్లీ ఛాప్లిన్: “ఏ రోజు నువ్వు నవ్వలేదో ఆ రోజు వ్యర్థం”.
అతని కన్నీరుని కప్పిబుచ్చగల వర్షం నవ్వుని దాచ లేదు. వర్షం లో నవ్వుతూ ఆడుకునే పిల్లలకే తెలుసు హాస్యం విలువ. కపటం లేని వారి మనసులకి వికటాట్టహాసాలూ, విషపు నవ్వులు తెలియవు. ముద్దొచ్చే చంటి పిల్లల నిద్దట్లో నవ్వు కన్నా ఆహ్లాదకరమైనది ప్రపంచంలో లేదు.
నవ్వు ఎన్నోరకాలు … మందహాసం, ప్రేమ చిరునవ్వు, వికటాట్టహాసాలూ, విషపు నవ్వులు, ఏడవలేక, ఇబ్బంది కోపంతో ఇలా ఇంకెన్నో. మన సినిమాలలో హీరో, హీరోయిన్.తరవత ముఖ్యులు హాస్య కళా కారులే. ఒకతని హాస్యం నాకు చాలా అసహ్యం. సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో పోయిన రోజు పత్రికల ఫోన్లు ఆగకుండా వాగాయి. వేలమంది ముఖ్యులు ఆ రోజు ప్రజలచే ఉట్టుట్టినే చంపబడ్డారు.. ఒక ఆవిడ (అతని భక్తురాలు) ఏడుపు కంఠంతో అడిగింది. “ఏమండీ ….. గారు (అతని పేరు చెప్పి) ప్రమాదంలో పోయేరుట…” ఆవిడ వాక్యం పూర్తి చెయ్యకుండానే.జవాబు ఇచ్చేను, .”సారీ అండీ. చాలా దుఃఖంతో చెప్తున్నా. అతను ఇంకా చావలేదు. తాగి ఇంట్లోనే.పడున్నాడు,”.అని ఫోన్ పెట్టేను. చెడురోజైనా అవేళ మనసు శాంతించింది.
“నవ్వు నాలుగు విధాల చేటు” అనే సామెత ఎలా పుట్టిందో కాని నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిదనీ, దానివల్ల ముఖంలో చాలా కండరాలకి కసరత్ ఐ లాభం కలుగుతుంది అని డాక్టర్లు అంటారు. ఒక ఫేషన్ విశేషజ్ఞుడి ప్రకారం నువ్వు ఎంతమంచి బట్టలు, ఎన్ని ఆభరణాలు ధరించినా ముఖం మీద చిరు నవ్వు లేకపోతే అవన్నీ వ్యర్ధం. చిరునవ్వు లేకపోతే స్వాగతం అసంపూర్ణం.
మరాఠీ హాస్య సాహిత్యంలో ప్రధమ స్థానం ఎప్పుడూ పురుషోత్తం లక్ష్మణ్ దేశ్పాండేదే. ‘పుల’గా పేరుపడ్డ అతనితో 55 ఏళ్ళకింద మాట్లాడితే అతను చెప్పారు: “అతిపురాతన మైన గ్రంధం ’నాట్య శాస్త్ర’ ప్రకారం హాస్యం కరుణరసం నుంచి పుట్టింది. అది ‘గాజు సామాను జాగ్రత’ బోర్డు లాటిది,జీవితం ముక్కలవకుండా.కాపాడి షాక్ నుండి రక్షణ ఇచ్చే సేఫ్టీ spring. తనకి బోధపడని జీవితాన్ని చూసి భయపడే, అరటి తొక్కమీద జారి పడే, మనిషిని చూసి మనం నవ్వుతాం.” హాస్యం లేకపోతే జీవనం దుర్భరం.
ఛాప్లిన్ ప్రతి సినిమాలోనూ అతను తప్పులు చేస్తున్న దయాపాత్రుడే …. తను నవ్వుతూ కనిపించడం చాలా తక్కువ. తనకంటి నీటితో ప్రేక్షకులను నవ్వించి తను నవ్వుతూ మనకి కన్నీరు తెప్పించే మహా నటుడు ఛాప్లిన్.
హాస్యంగా మాట్లాడగలడం పురుష లక్షణాలలో అన్నిటికన్నా ముఖ్యం, వారి అందంకాదు. అని స్త్రీలు భావిస్తారని చాలా పరీక్షణలలో తేలింది
హిందీ లో హాస్య కవి సమ్మేళనాలు చాలా జనప్రియం. హాస్య కవిత్వం మాత్రమే రాసే కాకా హాథరసీ, తను నవ్వకుండా చెప్పే.సత్యనారాయణ శర్మ శరద్ జోషి , మరాఠీలో’ ‘పు.ల.’ లాటివారు ప్రదర్శనలు పెట్టి రెండు మూడు గంటలు ఒక్కరే ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. వాటికి టికట్లు కొని వెళ్ళే వారు కూడా ఉండేవారు.
హాస్య సాహిత్యం మాత్రమే రాసి దానితోనే బతికిన పి.జి.వుడ్ హౌస్, హెన్రీ సెసిల్, రఛర్డ్ గోర్డన్, జెరోమ్ కె..జెరోమ్ వంటి ఎందరో రచయితలు కూడా ఉండేవారు. ‘పంచ్’ వంటి హాస్య
పత్రిక కూడా ఉండేవి. ఖ్యాతి పొందిన రీడర్స్ డైజెస్ట్ పత్రికలో ‘Laughter The Best Medicine’, ‘Jest (just కాదు) What The Doctor Ordered’ అనే
హాస్యం పేజీలని ఎక్కువ మంది చదువుతారు
.
ఇంగ్లండులో్నే పుట్టిపెరిగి హిందువుగా మారిన డాక్టర్ ఎనీ బెసంట్ కి ఇండియా ఎంతో నచ్చినా దేశంలో ఒకే ఒక లోపం కనిపించేది: Indians lack a sense of humour.