www.thetelugus.com

ఇంతే సంగతులు

By Someswar Bhagwat

తెలుగు వారికి చాలు రెండు రాష్టాలు

ఇద్దరు తెలుగువారు కలిస్తే ఇంగ్లీష్ లోనొ హిందీ లోనో మాత్రమే మాట్లాడ్డం మామూలే. ప్రపంచంలో చచ్చిపోబోయే భా‌షల జాబితాలో 110 మంది మాత్రం మాట్లాడే భాష కు బదులు కోట్లమంది మాట్లాడే తెలుగు ఒక సంయుక్త రాష్ట నివేదికలో ఉంది. దీనికి కారణం ఒకటే. తెలుగు వారికి తెలుగు అంటే గౌరవం లేక పోవడమే.

‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్నది ఒక తుళు (కర్ణాటక)మాట్లాడే  శ్రీక్రిష్ణ దేవరాయలనే రాజు.  తెలుగు తల్లికి ‘మల్లె ఫూదండ’ వేసి మన రాష్ట్రీయం రాసింది ఒక తమిళమూలపు (చిత్తూర్)

అయ్యంగార్ ఐన  కవి – శంకరంబాడి సుందరాచారి‌.

మనని మనం పొగుడుకోడం కన్నా ఇతరులు పొగడటం గొప్ప కాబట్టి అది గర్వం కారణమే. చిన్న రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు నుంచి మనకన్నా ఎక్కువ మంది పని కోసం పైరాష్ట్రాలకి  తరళి వెళ్తారు. ఉద్యోగ విరమణ తర్వాత అందులో  సగంమందేనా తిరిగి వెళ్ళి తమ ఊళ్ళలో స్థిరపడతారు. కాని తెలుగువారు మాత్రం పై ప్రదేశాలలో ఇళ్ళు కట్టుకొని అక్కడే స్థిరపడి తెలుగు లిపి మరిచిపోతారు. రెండో, మూడో తరాల వారు తెలుగు మాట్లాడినా చదవలేరు. తర్వాత తరాల వారు అదికూడా చెయ్యలేరు.

దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ‌‌నేషనల్  హెరాల్డ్ సంస్థాపక  సంపాదకులు కోటంరాజు రామారావు కొడుకు విక్రమ్ ఇంట్లో ఎవరూ తెలుగు  మాట్లాడరు ‌‌‌‌. అతను మాత్రం ప్థవాస ఆంధ్రుడనైన నాతోనే 50 ఏళ్ళక్రితం తెలుగు మాట్లాడేవాడు, లఖ్నోలో స్థిరపడీ, అహ్మదాబాద్ ‌,  ముంబై లలోపనిచేసి‌.

ప్రవాసాంధ్రుడిగా నేను ఇంటిలో తెలుగు నేర్చుకున్నప్పడు ఒక ఊహ వచ్చింది: వార్ధా ‘రా‌ష్ట్ర భాషా ప్రచార్ సమితి’లా దేశమంతా తెలుగు  క్లాసులూ, పరీక్షలూ ఎందుకు నడిపే కూడదు? ఈ పని ఏం పనీలేని హైదరాబాద్ లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు కలిసీ నడుపుతున్న తెలుగు విశ్వవిద్యాలయం చెయ్యొచ్చు 

ఆ విద్యాలయం కేవలం రాజకీయాలు నడిపి పెద్ద జీతాలతో ‘కావలసిన’ వారిని మేపడానికే పరిమితం చేస్తే మరొక సమితిని స్థాపించవచ్చు. తక్కిన భాషలో వారికి మనం మార్గం చూపిన వారిమౌతాం,

సమితి మరొకటి ఘంచిదే కాని మూడో తెలుగు రాష్ట్రం మాత్రం వద్దు. దేశంలో భాషా రాష్ట్రాలు తెలుగు వారి వల్ల వచ్చాయి… పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్ల. అలాగే ఎందరో బలి అయాక ఒక పార్టీ  సదుపాయం కోసం ఒక ప్రాంతం ఉఛ్ఛారణ కోసం రెండో రాష్ట్రం తయారయింది. ఇప్పుడు రాజకీయ కారణాల కోసం ఎవరైనా రాయలసీమ ఉద్యమం  మొదలెట్ట వచ్చు. నవాబులకి ‘బాంచను, కాల్మొ క్కుతా’ అనడానికీ ఆంధ్రని రెండు చేసేం.

ఇండియా+పాకిస్తాన్ కలిపి   అఖండ భారత్ ఐనా అ రెండూ మాత్రం ఒకటి అవవు. ఇప్పుడు కన్నడిగుల కాళ్ళు నాకడానికి మూడు ముక్కలు చేస్తే ప్రతి జిల్లా ఒక రాష్ట్రం చెయ్యాలి ‌‌బెర్నార్డ్ షా  Pygmalion (My Fair Lady సినిమా) లో Próf. Higgins అంటాడు – ప్రతి 50 మైళ్ళకీ ఉఛ్ఛారణ మారుతూ ఉంటుంది అని. తెలుగు దేశాన్ని ఎన్ని ముక్కలు చేస్తారు?

అలా ఐతే పుణే మరాఠీ నాగపూర్ మరాఠీ వేరైనా ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు చేసినా విదర్భ అవలేదు. కారణం అప్పటి సంయుక్త మహారాష్ట్ర సమితి:

ఉత్తర ప్రదేశ్ లో మగథీ, అవథీ, భోజ్పురీ లాంటి ఎన్నో భాషలు ఉన్నాయి ‌‌ఎన్నో భాషలని కలిపితే హిందీ అయింది.

తెలుగు భాష నేర్పడానికి ఉద్యమం మూడు సంవత్సరాల కీఃద నేను ప్రతిపాదించినా జరగ లేదు… మూడో తెలుగు రాష్ట్రంకి మాత్రం పదవి వ్యామోహంతో ఎవరేనా ముందుకు రావచ్చు.

దశాబ్దాల కిందట దసరా పాటల్లో ఉండేది “అయ్యవారికి చాలు ఐదు వరహాలు ‌‌‌ ‌‌….” అని. అలాగే తెలుగు వారికీ చాలు  రెండు రాష్ట్రాలు ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here