స్ఫూర్తి, అనుకరణ, రచన దొంగతనం
By Someswar Bhagwath
స్ఫూర్తి, అనుకరణ రచనా విధానాలు విడమర్చి చెప్పడం చాలా కష్టమైన పని John Keats. రాసిన a thing of beauty is a joy forever అనే పద్యం తెెలుగులో :అందమె ఆనందం’ అనే పౌటకి స్ఫూర్తి కావచ్చు కాని దాని అనుకరణ కాని అనువాదం కాని కాదు. ఎందుకంటే దాని తరువాతి చరణం ‘ఆనందమె జీవన మకరందం’ Keats పద్యంలో లేదు. తెలుగు నుంచి Keats కాపీకాట్డాడని, Shakespeare All the World is a Stage ‘జీవితమే ఒక నాటకరంగం ఒక నాటకరంగం’కి కానీ అది అనుఅనలేము — కారణం మనం బానిసత్వం వల్ల ఇంగ్లీష్ నేర్చుకున్నొ Keats మరియు Shakespeare తెలుగు నేర్దుకో లేదు.
ఈరెండు ఇంగ్లీషు వారి వల్ల inspire అవడంకన్నా ‘great minds think alike ‘ అనే సత్యానికి మంచి ఉదాహరణలు.
రచనా దొంగతనం న్యాయ.విషయం కన్నా ఒక నైతికతకు చెందిన ప్రశ్న. పుట్టపర్తి సత్య సాయిబాబా తెలుగు వ్యాఖ్యానాలు తర్జుమా చేసిన ఒక పేరుపొందిన పత్రికాసంపాదకుడి కొడుకు ఒక రచనా దొంగతనం కేసులో ఇరుక్కుని ఒక ప్రముఖ దేశ పత్రిక (national daily) నుంచి సహ సంపాదకుడిగా త్యాగ పత్రం ఇవ్వవలసి వచ్చింది… అలా ఎవరూ అడగక పోయినా. లక్షలమంది రచనలు చేస్తున్న ఈరోజుల్లో ఇలా దొంగతనం చెయ్యడం కష్టం కాదు. మూలం రచనని చదివి ఎవరో చెబితేనే ఈ విషయం బయట పడుతుంది. మాలతీ చందూర్ చాలా మంచి రచయిత్రి
ఎన్నో తరాల పాఠకులకు మార్క్ ట్వైన్ వంటి గొప్ప ఇంగ్లీషు. రచయితల్ని పరిచయం చేశారు. ఆవిడ తలుచుకుంటే ఎన్నో ఇంగ్లీషు నవలలు తెలుగులో తన స్వంత రచనలకింద చూపించి వచ్చు. కాని ఆవిడ అలా చెయ్యలేదు.
ముళ్ళపూడి వెంకటరమణ ‘బుడుగు’ chracter ఇంగ్లీష్ కార్టూన్లలో నుంచి Denice the menace చేత inspire ఐ ఉండవచ్చు కాని ఏమాత్రం అనుకరణ కాదు. అలాగే అందమైన అమ్మాయి ‘బాపు’ బొమ్మలా ఉంటుంది అంటాం. అతనికి రాజా రవివర్మ స్ఫూర్తి కావొచ్చు. కాని ఇద్దరి పనులలో ఏమాత్రం పోలిక లేదు.
ప్రపంచంలో ఎన్నో స్ఫూర్తి ఇచ్చే రచనలు, చిత్రాలు, వ్యాఖ్యానాలు, వాక్యాలూ ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఇంకా ఎక్కువ అనువాదాలు అవసరం. రచనల అనుకరణ, చౌర్యం మాత్రం ఆగిపోవాలి. Imitation is the best form of flattery అని ఆస్కార్ వైల్డ్ అనిఉండవచ్చు,. కాని ఏ creative పనినేనా పొగడడానికి మరొక దారి వెతకాలి