theTelugus.com

నువాదం, భావానువాదం రెండూ వేరుగా ఉండవచ్చు

by Someswar Bhagwat

మనసులో ఉన్ళదివేరు, 

మాటలలో వేరు, చాలా సార్లు ఔతూ ఉంటుంది. ఆలాగే  ఒక భాషలో రాసినది సరిగా అనువాదం చెయ్యకపోతే అర్ధం మారిపోతుంది. దానివల్లే ఇంగ్లీష్ లో lost in translation ఆనే మాట వచ్చింది.

అందుకే అనువాదం, స్వేఛ్ఛానువాదం, భావానువాదం transliteration వంటి వేరు వేరు విభాగాలు వచ్చాయి. ఆఖరిది (transliteration) తెలుగు మాట్లాడినా  చదవడం రాని తెలుగు వారికోసం. Instagram, YouTube లాటి సామాజిక మాధ్యమాల్లో తెలుగు చాలాసార్లు ఇంగ్లీష్ లిపిలోనే ఉండటానికి ఇదే కారణం. ఇందులో కూడా చాలా తప్పులు జరుగుతూ  ఉంటాయి.‌ ఒక భాషలో ఆలోచించడం మరో భాషలో మాట్లాడటం వల్ల కొన్ని తప్పులు భాష సరిగా రాక కొన్ని తప్పులు వస్తూ ఉంటాయి

నరేంద్రమోదీ ఎన్నో దశాబ్దాలుగా సామాజిక జీవితంలో ఉన్నా కొన్ని భాషల్లో (తెలుగు, కన్నడ, తమిళ్)  ఇంకా కొందరు డినేష్, డింకర్లు,  ‘మోడీ’ అనే రాస్తున్నారు, ‘మోడీ’ పాత మరాఠీ లిపి షేరని (దేవ నాగరికి.మారక పూర్వం)  తెలియకా, టివి రేడియోలు వారెప్పుడూ వినకా.  దీనికి ఇంగ్లీష్ లిపీ లోపాలు కూడా కారణం. తమిళ్ లో గాంధౌజీ  కి మకాట్మా కాంతీ అని రాయవలసి వచ్చినా, తెలుగు లో అలాంటి బాధలు లేకపోయినా ‘టెల్గూ’  వారు పై భాషలో ( ‘ఫేషన్’ కాబట్టి) మాట్లాడొచ్చు.  నాలాంటి మూర్ఖులే ప్రవాసాంధ్రులు ఐనా ఇంట్లో నేర్చుకున్న తెలుగులో రాస్తున్నారు.

ఇలా రాయడం లో కొందరు అనుకుంటారు అనువాదం సులభం,   మరొకరు ఆలోచించి రాసినది ఆలోచన లేకుండా భాష మార్చడమే కదా అని.  కాని ఇదో అంత సులభమైంది కాదు. పై  వ్యక్తి కాదు తలలో ప్రవేశించి  వారిలా ఆలోచించడం రావాలి. అసలు రచనకే మెరుగు దిద్దాలి.  ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్  అనువాదం చేసిన ఓమర్ ఖయ్యాం ‘రుబయ్యత్’ మూలం కన్నా ఎక్కువ ప్రసిద్ధి చెందింది.  అందులో  The moving finger writes and having writ, moves on: nor all thy piety nor wit nor tears can lure it back to cancel half a line  అనే ఒక పద్యం Organiser అనే జనసంఘ్ పత్రికలో లాల్ కృష్ణ అద్వానీ ఆఖరి పేజీ లో రాసే రచనకి శీర్షిక. (జనసంఘ్ ముస్లిం వ్యతిరేకి అనే ప్రచారం ఉన్నా). 

అందుకే  అన్నారు  అనువాదం, స్వేఛ్ఛానువాదం, భావానువాదం  మరియు  transliteration. ఈ ఆఖరు విధానం ఒక భాషని మరొక భాష లిపిలో రాయడం –. తెలుగు మాట్లాడే చదవడం రాని తెలుగు, వ్రవాసాంధ్రుల కోసం. ఇప్పుడు అర్ధం అవుతున్నది ఎందుకు కర్ణాటక లో అందరికీ కన్నడం రావాలి అంటారో  — ఇక్కడ నూటికి తొంభై మందికే తెలుసు వచ్చినా. వారికి వారి భాష మీద చాలా అభిమానం  మనకు లేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here