’నేను’ ఒక సంపాదకుడినే, కాని ఈ అభిమతం మాత్రం ‘మాదే’
by సోమేశ్వర్ భాగవత్
ప్రవాసాంధ్రుడిగా నేను ఇంట్లో తెలుగు నేర్చుకున్నా ప్రఖ్యాత మైన చిన్నయ సూరి తెలుగు వ్యాకరణం చదవ లేదు. అందుకే నా తెలుగు రచనలలో తప్పులు వస్తూ ఉంటాయి. వాటికోసం క్షమించండి అనడం తెలియని చిన్న వయసు లోనే – అంటే minor గానే – ఇంగ్లీషు కలం కార్మికుడిగా స్థిర పడీ పోయాను.
సంపాదకుడు అయే ముందే ఒక ఇంగ్లీషు సత్య వాక్క (axiom) తెలిసింది: The first-person plural is rhe prerogative of kings, editors, and fools, అని. రాజులు తమ గురించి ఒకరితో చెప్పినప్పుడు ‘మేము’ అని సంబోధిస్తూ ఉండటం సామాన్యం. అలాగే ఏ సంపాదకుడూ ఏ అభిప్రాయం వ్యక్తం చేసినా అది నా అభిప్రాయం అని రాయడు – అది ‘మా’ అభిప్రాయం అంటాడు. బుద్ధిలేని వారికి ego తక్కువ ఉండదు – మేం అనే అంటారు.
(ఒకప్పుడు సంపాదక హోదా పురుషులకు మాత్రమే పరిమితం కాని ఇప్పుడు చాలా పత్రికలకీ స్త్రీలు సంపాదకులు – కాని వారికి కూడా ఇది వర్తిస్తుంది. వకీళ్ట్ళు అన్నట్టు in law man embraces woman. మీరు మరోలా అనుకోక ముందు దీని అర్ధం “ఇది ఇద్దరికీ వర్తిస్తుంది” అని,)
రాజులు, సంపాదకుల ఈ స్త్రీలు ఇప్పుడు హిందీ సినిమా హీరోలను చేర్చుకోవాలి. “హమ్ ఆప్ కే ఆఖోంమే ఇస్ దిల్ కో బసాదే తో?” ఆనే గురుదత్త్- మాలాసిన్హా పాటలో (ప్యాసా) మై అనడు, హమ్ అంటాడు. మరో పాటలో ” మైనే దిల్ తుఝ్ కొ దియా” అంటే అ సినిమా రాజ్ కపూర్ జీవితంలో అన్నిటికంటే పెద్ద ఫ్లాప్. ఇదీ మై కీ హమ్ కీ ఉన్న తేడా.
ఇలాటి ఉదాహరణలు ఎన్నో.
కాని ఈ జబ్బు హిందీ సినిమాలకి పరిమితం. తెలుగు హీరో “నా హ్రుదయం లో నివసించే చెలీ” అనే తన ప్రేయసిని సఁఃబోధీస్తాడు. మరాఠీ హీరో ప్రేయసిని. ” మాఝా హోశిల్ కా (నాదానివి ఔతావా?) అనే అడుగుతాడు. గుజరాతీ, బెంగాలీలలో కూడా ఈ బాధ లేదు.
అందుకే బాలీవుడ్ దేశంలో సినిమా కేంద్రాలకి రాజు అయి ఉంటుంది. హమ్ అనడం రాజ లక్షణం కదా?