కాతిల్ కాదు ఖాతిబ్,
నుదిటి రాత రాసినది
సోమేశ్వర్ భాగవత్
మనం బోధ పరచుకునేదీ, మనకి కనిపించేదీ విన్నదీ మనసు లో ముందునుంచీ ఉన్న ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రం వాడి మేజిక్ షోలు న్తడుపుతారు. కొందరు ఇఃద్రజాల సృష్టికర్తలు మాయ అంటే భ్రమ్హ కలిగించడమే ఆని అంతా హస్తలాఘవం మాత్రం అని కూడా చెప్పవచ్చు.
కొన్ని దశాబ్దాల క్రితం ఢిల్లీ లో ఓక సహోద్యోగి అడిగితే నాకు గాయకుడిగా అందరికన్నా కె ఎల్ సెహగల్ ఇష్టం అని, అలాగే అతని పాట. ‘ఏ కాతిల్-ఎ-తకదీర్ ముఝె ఇతన బతాదే’ చాలా బాగుంటుంది అని అంటె ఆ స్నేహితుడు నవ్వి అది కాతిల్ కాదు, ఖాతిబ్. కాతిల్ అంటే చంపిన మనిషి, ఖాతిబ్ అంటే రాసే వ్యక్తి. కితాబ్ (పుస్తకం) ఇందులోంచే వచ్చింది”, అని.
నాకిప్పుడు తప్పుకి సిగ్గు వేసింది కాని ఎందుకు తప్పు చేసానో తెలిసింది– ఆ ఉర్దూ పౌట రచయిత ముస్లిం. నుదుట మస భవీష్యత్ రాయడం హిందూ నమ్మకం. ముస్లిం అనగానే చంపడం గుర్తు వస్తుంది. కాబట్టి కాతిల్ మనసులో మెదిలింది.
మనకి తెలిసిన విధం లోనే మనం. ఆలోచన చేస్తాం. గుడ్డివాడు రంగులని ఊహించలేడు, నాకు తెలిసిన ఒక అంధ మహిళ చీర blouse ఒకఏరంగువి ఏరగలదు — ఒక texture కి ఒక రంగు కేటాయించి, అందుకే మూగవారు అసలు లేరు. వారికీ చెముడు మాత్రమే కాని శబ్ధం అంటే తెలియదు. అందుకే మాటలు రావు. ఇది నాకు చెప్పినది కూడా ఢిల్లీ లో ఒక సెహగల్ పేరుగల మిత్రుడే.
అదే ఢిల్లీ లో ఒక బెంగాలీ సహోద్యోగి తనకీ రెండు ఏళ్ళ వయసులో కళ్ళజోడు వస్తే ఆతర్వాత ఎన్నో రోజులు ఇంటి బయట కూర్చుని తన చుట్టూ చూసేవాడు — ప్రపంచం ఎలా ఉంటుందో. తను మొదటి సారి అలా చూస్తూ ఉండటం వల్ల. (చాలా మంది బెంగాలీలకి కళ్ళ సమస్య పుట్టినప్పుడే ఉంటుంది. ఒక విఖ్యాత వ్యంగ్య చిత్రకారుడు, శంకర్, బెంగాలి అనగానే – అప్పుడే పుట్టినా — కళ్ళద్దాలు తొడిగి చూపేవాడు.)
ఈ ఉదాహరణ మనస్సులో ఉన్న ఆలోచనలకి మనకు బోధపడిన దానికి ఉన్న సంబంధాన్ని తెలియ చేస్తుంది.
అనర్గళంగా మాట్లాడే ఢిల్లీ సెహగల్ మూగ పిల్లలతో ఒక నాటకం వేయించాడు – దర్శకుడిగా. దాని పేరు ‘ముము’. నాటకం లో వాడిన – ప్రతి మూగవాడు ఉఛ్ఛరించ గల — ఒకే పదం.