మందార మకరంద మాధుర్యం 

గ్రోలుతారా, తేనె తాగుతారా?

by  సోమేశ్వర్ భాగవత్

మందార మకరంద మాధుర్యమును గ్రోలుతారో తియ్యని పూతేనె తాగుతారో మీఇష్టం. భూపేన్ హాజారికా “గంగా తూ ఆయి కహాసే?” (ఓగంగా నువ్వు‌ ఎక్కడ నుంచి వచ్చావు). అని అడిగినప్పుడూ, కవి  శ్రీనాధుడు దాహంవేసి శివుడీని ఒక జంగం బికారి గా చిత్రీకరించి నీకిద్దరు పెళ్ళాలెందుకు “గంగా విడువు, పార్వతి చాలును” అని సలహా ఇచ్చినప్పడు గంగ ఒక నది మాత్రం ఐనట్టు మందార (hibiscus) పువ్వు ఐనా తియ్యని తేనె కలిగిన  పువ్వుగా ఇక్కడ వాడేరు

 (మందార పువ్వులో తేనె ఉండదు (   మందార మకరందం, పువ్వులోని తేనె రెండూ ఒకటే. మొదటిది గ్రాంధికం.  రెండోది వ్యవహారికం. రెండూ ఒకటే.  రెండూ తెలుగే. 

గురజాడ అప్పారావు తన రచనలు వ్యావహారిక భాషలో రాయడం మొదలెట్టే  ముందు అన్ని రచనలూ గ్రాంధికం లోనే ఉండేవి. ఇప్పటికీ కొన్ని అలాగే రాస్తున్నారు. కాని ఇప్పుడు ఎవరేనా గ్రాంధికంలో మాట్లాడితే అందరూ నవ్వుతారు. 


ఇలాటి తారతమ్యం ఇంగ్లీషు భాషలో కూడా ఉంది ఇంగ్లీష్ ‘పవిత్ర గ్రంధం’ బైబిలు లో said కి బదులుగా quoth వాడబడింది. ఒక అధ్యాయం నిండా  ఎవరు ఎవరి తండ్ర్రో చెప్పడానికి ‘begat’ అనే, ఇప్పుడు ప్రచారంలో లేని, పదం వాడబడింది. ఈ రెండూ ఇప్పుడు వాడితే నవ్వుతారు.


ఒకప్పుడు వాడబడిన బాష ఇప్పటి భాష చాలా భాషల్లో వేరు. ఒకప్పుడు ఏ సంస్క్రత పదానికేనా ‘డు, ము. వు’  లు  తగిలిస్తే ఆది తెలుగు అయిపోయేది.‍(రామ్  – రాముడు) మనదేశంలో భాషలకి అన్నింటికీ సంస్కృతమే‌మూలం కాబట్టి. అలాగే ఉర్దూ కి మూలం పెర్పియన్ కాబట్టి ఆ భాష పూర్తి వాక్యాలనే ఉర్దూ లో కొందరు ఉపయోగిస్తారు.   సంస్క్రతంలోని మహాషయ తెలుగులోకి అలాగే‌‌ దిగుమతి‌చేసుకుంటే అదే‌ బెంగాలీ లో ‌‌‌  ‘మోషై’ గా మారుతుంది.


జార్జ్ బెర్నార్డ్ షా‌ నాటకం :Pygmalion’  (అదే ఇంగ్లీష్ సినిమా My Fair Lady with  Audrey Hepburn as heroine) లో Prof. Higgins అనే భాషావేత్త ఎవరేనా ఒక వాక్యం మాట్లాడితే ఇంగ్లేండ్ లో ఎక్క్టడ నుంచి వచ్చిందీ చెప్పగలిగేవాడు..ఎందుకంటే ప్రతి 50  మైళ్ళకీ ఉచ్ఛారణ మారుతుంది అని అతని సిధ్ధాంతం. 
అలాగే విశాఖపట్నం తెలుగు,  రాయలసీమ, తెలంగాణ తెలుగు కంటే వేరు. అందుకే ఆంధ్ర దేశం దేశ మొదటి భాషాప్రయుక్త రాష్ట్రమే కాక ప్రాంతీయ  dialect ఆధారంగా రెండుగా విడిపోయింది.‌కొందరు స్వార్ధపరుల రాజకీయాల వల్ల మూడు ముక్కలు కూడా అనొచ్చు, తెలుగు చదవలేనీ తెలుగువారికి లిపి నేర్పడానికి ఉద్యమం నడపడం తో పాటు దేశంలోని ప్రవాసాంధ్రుల కి ఒక పత్రిక నడపడానికి, తెలుగుదేశాన్ని మూడు ముక్కలు చేయకూడదనీ కూడా ఉద్యమాలు నడపవచ్చు. సంయుక్త మహారాష్ట్ర సమితి విదర్భ అనే రాష్ట్రం అవనీయ లేదు. అలాగే ఈ మూడో ఉద్యమం రాయలసీమ వేరవకుండా చూడగలదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here