www.theTelugus.com

అక్షరాలు, కలం పేర్లూ, వేనక దాగే రచయితలు

సోమేశ్వర్ భాగవత్

రచయితలు ఎందుకు  రాస్తారు? దానికున్న ఎన్నో కారణాలలో ముఖ్యం తన మనసులో ఉన్నది వ్యక్తం చెయ్యడానికి ఉన్న తపన, మరొకరి మెప్పు పొందాలనే కోరిక, రచన తెచ్చే ప్రశస్తి/పేరు, ఇలా ఎన్నో ఉన్నాయి. నాలా కొందరు ‘కలం కార్మికులు ‘ అయి రచనే వృత్తి గా పరిగణిస్తారు. కొందరు పుస్తకాలు రాసి పేరూ, డబ్బూ గణిస్తారు. కాని ఎవరూ  ఏ కారణం లేకుండా రాయరు.

ప్రతిష్ఠ కోసం రాసే వారు మరి ఎందుకు వారి పేర్ల పొడి అక్షరాల, లేక కలం పేరు వెనక దాగి ఉంటారు? దానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  ఒకప్పుడు స్త్రీల రచనలు ఎవరు ప్రచురించరని ఒక రచయిత్రి George Eliot అనే మగ పేరుతో పుస్తకాలు రాశారు. ఈ రోజుల్లో అందరికన్నా ఎక్కువ గ్టణిఝచిన్తది J…K.Rowling   అనే రచయిత్రి.

.రచయితలే కాకుండా  సినిమా  నటీ నటులు కూడా పేర్లు మార్చుకొని పని చేస్తున్నారు  (కొన్ని  సార్లు numerology నమ్మి, లేక పేరు మారితే అద్రుష్టం మార వచ్చనే నమ్మకంతో).

ఈ సందర్భంగా ప్రఖ్యాత రచయిత సాంబశివ రావు తోట గారు పంపిన ఈ forward చూడండి:

వీళ్ళ పూర్తి పేర్లు మీకు తెలుసా?

ఎన్టీఆర్ అనగానే నందమూరి తారక రామారావు అని టక్కున చెప్పేస్తాం. ఎఎన్ఆర్ అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పేయచ్చు. కానీ, ఇలా కొందరు ప్రముఖుల పేర్లు పూర్తిగా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొందరు నిక్ నేమ్ ఫ్యామస్ అయిపోయి, అసలు పేరు తెలియని పరిస్థితి. బాపు బొమ్మ అందరికీ తెలుసు. కానీ బాపూ అసలు పేరు ఎందరికి తెలుసు? ఇక్కడ ఓ 56 మంది తెలుగు ప్రముఖుల అసలు పేర్లు తెలుసుకుందాము.

1. బాపు: సత్తిరాజు లక్ష్మీనారాయణ*

2. ఆచార్య ఆత్రేయ: కిళాంబి వేంకట నరసింహాచార్యులు

3. ఆరుద్ర: భాగవతుల సదాశివశంకరశాస్త్రి

4. శ్రీశ్రీ: శ్రీరంగం శ్రీనివాసరావు

5. జాలాది: జాలాది రాజారావు

6. సాహితి: చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి

7. వనమాలి: మణిగోపాల్

8. వెన్నెలకంటి: వెన్నెలకంటి రాజేశ్వరవరప్రసాద్

9. పినిసెట్టి: పినిసెట్టి శ్రీరామమూర్తి

10. సిరివెన్నెల: చేంబోలు సీతారామ శాస్త్రి

11. జొన్నవిత్తుల: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

12. దాశరథి: దాశరథి కృష్ణమాచార్యులు

13. అంజలి: అంజమ్మ

14. రేలంగి: రేలంగి వేంకటరామయ్య

15. ఘంటసాల: ఘంటసాల వేంకటేశ్వరరావు

16. రాజనాల: రాజనాల కాళేశ్వరరావు నాయుడు

17. K.R.విజయ: దైవనాయకి

18.. దేవిక: ప్రమీల

19. భానుప్రియ: మంగభాను

21. రాజబాబు: పుణ్యమూర్తుల అప్పలరాజు

22. జంధ్యాల: జంధ్యాల వీరవేంకటశివసుబ్రహ్మణ్య శాస్త్రి

23. ఏ.వి.ఎస్: ఆమంచి వేంకట సుబ్రహ్మణ్యం

24. పెండ్యాల: పెండ్యాల నాగేశ్వరరావు

25. ముక్కామల: ముక్కామల కృష్ణమూర్తి

26. చిరంజీవి: కొణిదెల శివశంకర వరప్రసాద్

27. కృష్ణభగవాన్: పాపారావుచౌదరి

28. చక్రవర్తి(సంగీత దర్శకుడు): కొమ్మినేని అప్పారావు 

29. రామదాసు: కంచర్ల గోపన్న

30. బీనాదేవి: బి.నాగేశ్వరీదేవి

31. మో: వేగుంట మోహనప్రసాద్

32. చే.రా: చేకూరి రామారావు

33. శారద: తాటిపర్తి సరస్వతి

34. బుచ్చిబాబు: శివరాజు వేంకట సుబ్బారావు

35. ఎన్.ఆర్.నంది: నంది నూకరాజ

36. సినారె: సింగిరెడ్డి నారాయణరెడ్డి

37. నగ్నముని: హృషీకేశవరావు*

38. తిరుపతి వేంకటకవులు: దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి

39. కొవ్వలి: కొవ్వలి లక్ష్మీ నరసింహారావు

40. కా.రా: కాళీపట్నం రామారావు

41. వోల్గా: పోపూరి లలితాకుమారి

42. ఉషశ్రీ: పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు

43. కరుణశ్రీ: జంధ్యాల పాపయ్య శాస్త్రి

44. గద్దర్: గుమ్మడి విఠల్ రావు

45. గోరా: గోపరాజు రామచంద్రరావు

46. చా.సో: చాగంటి సోమయాజులు

47. జరుక్ శాస్త్రి: జలసూత్రం  రుక్మిణీనాథశాస్త్రి 

48. విద్వాన్ విశ్వం: మీసరగండ్ల విశ్వరూపశాస్త్రి

49. రావిశాస్త్రి: రాచకొండ విశ్వనాథ శాస్త్రి

50. మిక్కిలినేని: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

51: అనిసెట్టి: అనిసెట్టి  సుబ్బారావు* 

52. శోభన్ బాబు: ఉప్పు శోభానా చలపతి రావు

53. జయసుధ: సుజాత

54: వాణిశ్రీ:  రత్నకుమారి

55: జిక్కి : పి.జి.కృష్ణవేణి

56: ఏ.యం.రాజా: అయిమల మన్మథరాజు రాజా

57. చక్రపాణి ( విజయా ప్రొడక్షన్స్ ): ఆలూరి వెంకట సుబ్బారావు

58. జ్వాలాముఖి : వీరవల్లి రాఘవాచార్యులు

తెలుగు వారు మామూలు గా ఆంగ్ట initials చిన్న పేరు గా  వాడుతారు. పాములపర్తి వెంకట‌నరసింహా రావు PV  గ్టా చెలామణి ఐతే ప్రఖ్యాత హాస్య రచయిత పురుషోత్తమ్ లక్షణ్ థశ్ ‌పాండే మరాఠీ పద్దతిలో ‘పులా’ గా పేరు పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here