www.theTelugus.com

*బుధ్ధి లేని వారే పుస్తకాలు రాస్తారు*

రచయితకీ ప్రకాశుకులకూ మధ్య ఎలాటి ఒప్పందం ఉండాలి అని quoraలో ఎవరో ఆడిగారు.

ఎలాటి ఒడంబడికలు చేసుకోవాలో ఎవరూ చెప్పలేరు కానీ ఈదేశంలో  ఈ ఒడంబడికలు అన్నీ రచయితలకు విరుధ్ధ మైనవే. పుస్తకం స్వయంగా ప్రచరించుతే దాన్ని అమ్మడం చాలా కష్టం. వితరణసంస్థలు (distributors) పుస్తకం ఖరీదులో 80 శాతం వరకూ తీసుకుని 20 మాత్రం రచయితలకి ఇచ్చి, పుస్తక ప్రచురణ , designing, అచ్చువేయడం,  వారికి పంపడానికి అయే ఖర్చులు అన్నీ రచయితనే పెట్టుకోమంటారు. కొందరైతే unsold కూడా తిరిగిఇవ్వరు.  

ఒప్పందం ఒక్క royalty కాక ఈ అన్ని విషయాల మీదా ఉండాలి. Royalty ఎంతో, ఎప్పుడు, ఎలా ఇస్తారో స్పష్టంగా ఉండాలి. కాపీరైట్ గురించి స్పష్టం చెయ్యాలి.

స్వయం ప్రచురిత పుస్తకాలు కొన్ని book shops తీసుకోరు – అవి వితరణసంస్థలు మాత్రం ఇవ్వాలి. తీసుకున్నా ఈ depots అమ్మకపు లెఖ్ఖ సరిగా ఇవ్వరు కాని 25% తీసుకుంటారు.

రచయిత కొత్త వారైతే వాటిని సరిగా  ప్రదర్శించరు – ఏమూలో పడి ఉంటాయి. హిందీ రచయితలు కొందరు వారి  రచనలను చాలా తక్కువ ధరకి అమ్మకుంటున్నారు, అన్ని హక్కులతోపాటు. వారికి royalty కూడా దొరకదు. అందుకే వాటి quality కూడా అలాగే ఉంటుంది. ఒక అనువాదిత పుస్తక రచయితకు IBH 5 కాపీలు మాత్రం ఇచ్చి 2 ఏళ్ళుఐనా ఒకపైసా కూడా ఇవ్వలేదని తెలుసు. ఆనువాదకుడికి IBH ఏమీఇవ్వలేదు. 

ప్రభుత్వంలో influence ఉంటే వారు చెత్త కాయితాలు మధ్యని పెట్టి ముఖపుష్టం మాత్రం అచ్చు వేసి బైండ్ చేస్తే కొన్ని వేల కాపీలు కొనిపించుకో వచ్చు…. అవి ఏమూలో ధూళి జమాచెయ్యడానికి మాత్రం కనక.

కొందరు హోటల్లో ఇడ్లీ దోశల్లా వారానికొక  ‘శవ సాహిత్యం’ రాసేవారు మాత్రం రచనల మీద గణిస్తున్నరు. తక్కినవారు అభివ్యక్తి చెయ్యాలని ఉన్న గులతోనో లేక బుధ్ధిలేకో రచనలు చేస్తన్నారు. ఈదేశంలో రచయిత బతకడం చాలా కష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here