www.theTelugus,com

అంత్యదశలో తెలుగు నాటకం

ఒకప్పుడు ఆంధ్రకి ఇప్పుడు తెలంగాణ కీ పక్కనే ఉన్న మహారాష్ట్ర గురించి మనకి ఏమీ తెలియదు. మన నాటకాల్లో పద్యాలు (పాతవాళ్ళకి ‘ఝండాపై కపిరాజు’ గుర్తు ఉండ వచ్చు)  ఉన్నట్టే పాత మరాఠీ నాటకాలలో పాటలుండేవి. ‘ఝండాపై కపిరాజు’ ఆలాటిదే.

మరాఠీలో లోక్(folk) సంగీత్,(లావణీ‌, పొవాడా,‌ తమాషా), భావగీత్‌, శాస్త్రీయసంగీత్ లాగే ఒక branch నాట్యసంగీత్ కూడా ఉంది. ఇప్పడు ఉర్దూ నుంచి గజల్ కూడా మరాఠీ కి వచ్చింది.

తెలుగులో  పెర్హ్సియన్లోని   రుబయ్యత్ ని  ఎవరెనా అనుకరిస్తే  పొగుడుతాం కానీ  మన పద్య నాటకాలని ఆదరించలేక పూయాం.  ఇది చాలా దురదృష్టకరం. 

ఒకప్పుడు నాటకాల పద్యాలు చదివే విశిష్ట శైలి  తెలుగులో ఉండేది. ఘంటసాల వేంకటేశ్వర రావు  ఆ విధంగా పాడిన  పద్యాల రెకార్డులు ఇప్పటికీ  వినేవారు ఉన్నారు.  అలా పాడేవారు మాత్రo ఎవరూ లేరు.

బుర్రకధకీ, హరికధకీ మన సంస్కృతిలో స్థానం ఉంది.  అవి ఇప్పటికీ  గ్రామాలలో రాత్రల్లా నడుస్తాయి.  అలాగే నాటకాలు కూడా  ఉండవచ్చు.

ఈ మధ్య Instagram  లో ఒకరు అడిగారు: తెలుగులో మంచి సినిమా వస్తే ఏం చెయ్యాలి?  జవాబు  కూడా అక్కడే  ఉంది: ఫ్లాప్ అని చెప్పి తక్కువ రేటింగ్ ఇవ్వాలి. (ప్రశ్నా జవాబు రెండూ ఇంగ్లీషు లోనే). శంకరాభరణం సినిమాకి రిలీస్ అయిన మూడు నెలలకి (రష్ ఉంటుందని) వెళితే హాలులో మూడు వంతులు తమిళులు, కన్నడిగలు ఉన్నారు, అదీ హైదరాబాదులో.  మొదటి రోజు వెళితే అందరూ వారే ఉండురేమో.

తెలుగు నాటక వేదిక (stage)ని సినిమా చంపేసినా, మరాఠీలో అత్యాధునిక  సర్రియల్ 

నాటకాలూ‌ పాత సంగీత నాటకాలూ రెండు ఒకే ఊళ్ళో ఒకేసారి అవుతాయి.టేనెసీ విలియం  రాసిన  ‘గ్లాస్ మనసేరీ’ అనువాదమూ ‘సంగీత అభిగ్యాన శాకుంతలం’ అమెరికాలో గురుదేవ్   టాగోరే మీద రిసర్చ్ చేసి M.S. (Theatre) లో  Ph,D, చేసిన  Lee Morgan  అనే మిత్రుడికి 

మరాఠీలో మహారాష్ట్రలో ఒకెరోజున చూపించగలిగాను  58 ఏళ్ల  కింద. రెండు చాలా వేరయిన  విధానాలు ఓకే సమయంలో, మహారాష్ట్రలో రాణించినప్పుడు  తెలుగులో కూడా ఎందుకు సహజీవనం చెయ్య కూడదు? కొత్త పంథా నాటకాలతో పాటు పాత శైలివి   తెలుగులో కూడా  ఎందుకు ఉండకూడదు? బెంగాలీలో కూడా నాటకరంగం బతికే ఉంది  చాలా కొత్త తరహా experimental నాటకాలతో.   తెలుగులో మాత్రం రూపు మాసింది.  కోన ఊపిరి తీసుకుయింటున్న  మన కళలని  బతికి ఉంచడానికి ఎవరైనా బైటి వారు రావాలేమో – కూచిపూడికి జీవం పోసిన  మృణాలినీ సారాభాయి  లాగ.  

తెలుగు సాహిత్యం, సంస్క్రతి. నంగీతం అన్నీ సినిమాకి ఎలా బలి ఐపోయాయో Ph.D. 

పరిశోధనకి మంచి విషయాలు. ఎవరేనా చేస్తారా? కనీసం దీనికి  స్పందింస్తారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here